- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కార్నర్ సమావేశం సక్సెస్
- కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం
- సీఎం కేసీఆర్ సొంత జిల్లా నుంచే ఎన్నికల శంఖారావం
- హుస్నాబాద్ కాంగ్రెస్ అడ్డాగా ప్రకటించిన పీసీసీ చీఫ్
- ప్రభుత్వంపై విమర్శలు పెంచిన.. రేవంత్ రెడ్డి
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) పాదయాత్ర ప్రభావం ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ శ్రేణులకు, కొత్త ఊపునిస్తోంది. సీఎం సొంత జిల్లా నుండే ఒకరకంగా చెప్పాలంటే ఎన్నికల శంఖారావం పూరించినట్లేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పాదయాత్రలో, కార్నర్ మీటింగ్‌లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీఎం కేసీఆర్‌పైన చేస్తున్న విమర్శలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. వివరాలు..ఇలా వున్నాయి. పీసీసీ చీఫ్ మాటల్లోనే..
9 సంవత్సరాలు వేచి చూసినం. పనులు కావడం లేదు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదు. రైతుల రుణమాఫీ లేదు. ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు నష్ట పరిహారం లేదు. 24 గంటల విద్యుత్ రైతులకు అందుతే ఓట్లు అడగం, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలే, దళిత బంధు అమలు కావడం లేదు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడం లేదు. పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం లేదని పీసీసీ చీఫ్ చేస్తున్న ప్రసంగాలు ప్రజలను ఆలోచింప చేస్తున్నాయి.
ప్రభుత్వంపై మరో వైపు సీఎం కేసీఆర్‌పై రేవంత్ చేస్తున్న ఆరోపణలు.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో కొత్త ఉత్సాహం ఇస్తున్నాయి. సీఎం కేసీఆర్ సొంత జిల్లా ఒకప్పటి సీఎం కేసీఆర్ నియోజకవర్గం,ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గం. రాష్ట్రంలో నెంబర్ 2గా ఉన్న ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ సక్సెస్ కావడం చర్చనీయంశంగా మారింది.
పీసీసీ చీఫ్ కార్నర్ మీటింగ్.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఊపు
హుస్నాబాద్ కేంద్రంగా పీసీసీ చీఫ్ పాదయాత్రను పురస్కరించుకొని అక్కడి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే, టి, నర్సారెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నేతలు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ పై కాంగ్రెస్ ఛార్జ్ సీట్ పేరుతో బీఅర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ భూ బాగోతం, కబ్జాలపై ప్రెస్ మీట్ పెట్టీ కాంగ్రెస్ కన్నెర్ర జేసింది.
ఇది కూడా స్థానిక ప్రజలను ఆలోచింప చేసింది. పీసీసీ చీఫ్ చేసిన పాదయాత్ర ప్రభావం ఉమ్మడి మెదక్ జిల్లా పై పడింది. ప్రభుత్వం, సీఎంపై పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే సతీష్‌కు డిపాజిట్ దక్కదని ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అడ్డా అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెంచింది.
కాంగ్రెస్ పార్టీకి క్యాడర్కు కార్యకర్తలు నాయకులకు కొత్త జవసత్వాలు ఇస్తుంది.