విధాత‌, హైదరాబాద్: మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఉప్పల్ స్టేడియంలో ఈరోజు భారత్‌-ఆస్ట్రేలియా మూడో టీ-20 క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. మ్యాచ్ చూడటానికి వచ్చే ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే భారీ వాహనాలను అనుమతి ఉండదని చెప్పారు. సికింద్రాబాద్, ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను కూడా అనుమతించమని స్పష్టం చేశారు. స్టేడియం నలువైపులా ఐదు క్రైన్లు ఏర్పాటు చేశారు. మ్యాచ్‌ […]

విధాత‌, హైదరాబాద్: మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఉప్పల్ స్టేడియంలో ఈరోజు భారత్‌-ఆస్ట్రేలియా మూడో టీ-20 క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. మ్యాచ్ చూడటానికి వచ్చే ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే భారీ వాహనాలను అనుమతి ఉండదని చెప్పారు. సికింద్రాబాద్, ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను కూడా అనుమతించమని స్పష్టం చేశారు. స్టేడియం నలువైపులా ఐదు క్రైన్లు ఏర్పాటు చేశారు.

మ్యాచ్‌ నేపథ్యంలో 21 పార్కింగ్ స్థలాలను గుర్తించారు. గేట్ నెంబర్ 1 ద్వారా వీఐపీ, వీవీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పార్కింగ్‌లో 1400 కార్లు పట్టేలా పార్కింగ్‌ ఏర్పాట్లు జరిగాయి. సాయంత్రం 4 గంటల నుంచి స్టేడియం వైపు వెళ్లే భారీ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

మెట్రో రైళ్లు ఈరోజు రాత్రి ఎన్ని గంటల వరకంటే.

భారత్‌-ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి ఈరోజు రాత్రి 11 గంటల నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇక చివరి రైలు సెప్టెంబర్ 26 తెల్లవారుజామున ఒంటి గంటకు బయలు దేరనుంది.

అమీర్‌పేట్ - జేబీఎస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి కనెక్టింగ్ రైళ్లు ఉంటాయి. ప్రత్యేక రైళ్ల సేవ సమయంలో ఉప్పల్, స్టేడియం, ఎన్‌జీఆర్ఐ మెట్రో స్టేషన్లలో మాత్రమే ప్రవేశాలు అనుమతించబడతాయి. అన్ని ఇతర స్టేషన్లు నిష్క్రమణల కోసం మాత్రమే తెరవబడతాయి. మ్యాచ్‌కి వెళ్లే ముందు స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి నిష్క్రమించేటప్పుడు ముందుగానే రిటర్న్ టిక్కెట్‌లను కొనుగోలు చేయమని కస్టమర్‌లకు మెట్రో అధికారులు సూచిస్తున్నారు.

ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనుంది

భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి నగరంలోని 24 ప్రదేశాల నుంచి ఉప్పల్ స్టేడియానికి బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. మొత్తం 50 బస్సులను ఆయా ప్రదేశాల నుంచి ఉప్పల్‌కు నడుపనున్నామని చెప్పారు.

మెహదీపట్నం-శంషాబాద్‌ విమానాశ్రయం, ఉప్పల్ రూట్, ఘట్కేసర్-శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌, ఉప్పల్ రూట్, హయత్ నగర్, ఎన్జీఓ కాలనీ, ఇబ్రహీంపట్నం, ల్యాబ్ క్వార్టర్స్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, అఫ్జల్‌గంజ్, లకిడికాపూల్, బీహెచ్ఈఎల్, జీడిమెట్ల, కేపీహెచ్‌బీ, మేడ్చల్, మియాపూర్, జేబీఎస్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, యూసఫ్‌గూడ, బోయిన్‌పల్లి, చార్మినార్, చంద్రాయణగుట్ట, కొండాపూర్-శంషాబాద్‌ విమానాశ్రయం రూట్లలో బస్సులు అందుబాటులో ఉంటాయి.

Updated On 25 Sep 2022 8:26 AM GMT
Somu

Somu

Next Story