విధాత: క‌ళ‌ల్లో కెల్లా చోరీ క‌ళ ప్ర‌త్యేక‌మైన‌ది. ధైర్య సాహ‌సాలు గ‌ల వారే అర్హులైన ఈ క‌ళ‌లో బిహార్ చోరాగ్ర‌స‌రులు ఆరితేరారు. ఏకంగా రైలు ఇంజిన్‌నే మాయం చేశారు. బిహార్ బెగుస‌రాయ్ జిల్లా బ‌రౌనీలో మ‌ర‌మ్మ‌త్తుల కోసం మెకానిక్ షెడ్డుకు రైలు ఇంజిన్‌ను త‌ర‌లించారు రైల్వే అధికారులు. దానిపై క‌న్నేసిన దొంగ‌లు షెడ్డులోకి ఓ సొరంగ మార్గాన్నే త‌వ్వారు. రైలు ఇంజిన్‌ను ముక్క‌లు ముక్క‌లుగా విడిదీసి త‌ర‌లించి స్క్రాప్ దుకాణాల్లో అమ్ముకున్నారు. విష‌యాన్ని ఆల‌స్యంగా గుర్తించిన రైల్వే […]

విధాత: క‌ళ‌ల్లో కెల్లా చోరీ క‌ళ ప్ర‌త్యేక‌మైన‌ది. ధైర్య సాహ‌సాలు గ‌ల వారే అర్హులైన ఈ క‌ళ‌లో బిహార్ చోరాగ్ర‌స‌రులు ఆరితేరారు. ఏకంగా రైలు ఇంజిన్‌నే మాయం చేశారు. బిహార్ బెగుస‌రాయ్ జిల్లా బ‌రౌనీలో మ‌ర‌మ్మ‌త్తుల కోసం మెకానిక్ షెడ్డుకు రైలు ఇంజిన్‌ను త‌ర‌లించారు రైల్వే అధికారులు.

దానిపై క‌న్నేసిన దొంగ‌లు షెడ్డులోకి ఓ సొరంగ మార్గాన్నే త‌వ్వారు. రైలు ఇంజిన్‌ను ముక్క‌లు ముక్క‌లుగా విడిదీసి త‌ర‌లించి స్క్రాప్ దుకాణాల్లో అమ్ముకున్నారు. విష‌యాన్ని ఆల‌స్యంగా గుర్తించిన రైల్వే అధికారులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

పోలీసులు ద‌ర్యాప్తు చేసి ప‌రిస‌ర ప్రాంతంలోని ఇనుప‌ సామాన్లు కొనుగోలు చేసే దుకాణాల్లో రైలు ఇంజిన్ విడి భాగాల‌ను క‌నుగొని, వాటిని అమ్మిన వ్య‌క్తుల ఆచూకీ తెలుసుకున్నారు. ఆ క్ర‌మంలోనే ముజ‌ఫ‌ర్‌ పూర్‌లోని ఓ గోదాంలో 30 ల‌క్ష‌ల విలువ చేసే 13 బ‌స్తాల్లోని రైలు ఇంజిన్ విడి భాగాల‌ను స్వాధీనం చేసుకున్నారు. దొంగత‌నానికి పాల్ప‌డిన వారినంద‌రినీ పోలీసులు క‌ట‌కటాల పాలు చేశారు.

Updated On 26 Nov 2022 12:10 PM GMT
krs

krs

Next Story