విధాత, వరంగల్: ప్రిన్సిపాల్ తీరును నిరసిస్తూ గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాల విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ విద్యార్థినులు క్లాసులు మానేసి సోమవారం పొద్దున్నే ఆందోళనకు దిగారు. తమ పాఠశాల ప్రిన్సిపాల్ చైతన్య వేధింపులు తట్టుకోలేక రొడ్డెక్కామని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు న్యాయంచేయాలని విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. ప్రిన్సిపాల్ చైతన్యను బదిలీ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం […]

విధాత, వరంగల్: ప్రిన్సిపాల్ తీరును నిరసిస్తూ గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాల విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ విద్యార్థినులు క్లాసులు మానేసి సోమవారం పొద్దున్నే ఆందోళనకు దిగారు. తమ పాఠశాల ప్రిన్సిపాల్ చైతన్య వేధింపులు తట్టుకోలేక రొడ్డెక్కామని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు న్యాయంచేయాలని విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. ప్రిన్సిపాల్ చైతన్యను బదిలీ చేయాలంటూ నినాదాలు చేశారు.

ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడుతామని చెప్పినా ప్రిన్సిపాల్‭ను బదిలీ చేసే వరకూ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థినులు భీష్మించారు. ప్రిన్సిపాల్ తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తుందనీ, తమకు ఎలాంటి స్వేచ్ఛ ఇవ్వడం లేదని వివరించారు.

కనీసం దెబ్బలు తగిలినా ఇంటికి పంపించడం లేదని, సిక్ అయినా హాస్పిటల్‌కు నడిపించి తీసుకెళుతు న్నారని వాపోయారు. తమ తల్లిదండ్రలకు ఎలాంటి గౌరవం ఇస్తలేదని చెప్పారు. ఇలాంటి ప్రిన్సిపాల్ తమకు వద్దంటూ ఆందోళన చేశారు.

ఈ నిరసన సందర్భంగా అక్కడికి చేరుకున్న ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తాను నిబంధనల మేరకే వ్యవరించానని చెప్పారు. కాటారం ఎంపీపీ పంతగాని సమ్మయ్య విద్యార్థుల నిరసనను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ పాఠశాలను తనిఖీచేసి, విద్యార్థినులతో మాట్లాడి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. అందరి ప్రయత్నంతో విద్యార్థులు నిరసన విరమించారు.

Updated On 2 Jan 2023 9:07 AM GMT
krs

krs

Next Story