విధాత: తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 91 మంది ఐపీఎస్ ఆఫీసర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్పీ స్థాయి నుంచి ఐజీ స్థాయి వరకు బదిలీలు జరిగాయి. హైదరాబాద్‌లో డీసీపీలుగా పలువురు నియామకం అయ్యారు. వెయిటింగ్లో ఉన్న 45 మంది ఐపీఎస్‌లకు కూడా పోస్టింగ్‌లు ఇచ్చారు.
గతేడాది డిసెంబర్ 29వ తేదీన రాష్ట్ర డీజీపీగా అంజనీ కుమార్‌ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. డీజీపీగా మహేందర్ రెడ్డి డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. ఇక డీజీపీ నియామకంతో పాటు రాచకొండ పోలీసు కమిషనర్‌గా డీఎస్ చౌహాన్‌ను నియమించారు.
రాచకొండ సీపీగా కొనసాగుతున్న మహేశ్ భగవత్‌ను సీఐడీ అడిషనల్ డీజీగా నియామకం అయ్యారు. ఏసీబీ డీజీగా రవి గుప్తా నియామకం కాగా, విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా, డీజీగా జితేందర్, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా సంజయ్ కుమార్ జైన్ నియామకం అయిన సంగతి తెలిసిందే.