విధాత: ఒకవైపు పాఠశాలలు పనిచేస్తున్న సమయంలో హడావుడిగా టీచర్ల బదిలీలు చేపట్టాల్సిన అవసరమేంటని ఆలిండియా పేరెంట్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బుర్ర రాముగౌడ్‌ ప్రశ్నించారు. బదిలీల ప్రక్రియను వేసవి సెలవుల్లో చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన విన్నవించారు. ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులు దాదాపు ఐదు లక్షల మంది ఉన్నారని, ఇప్పుడు టీచర్ల బదిలీలు చేపడితే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఆయన అన్నారు. టెన్త్‌ విద్యార్థుల కోసం టీచర్లు ప్రత్యేక తరగతులు […]

విధాత: ఒకవైపు పాఠశాలలు పనిచేస్తున్న సమయంలో హడావుడిగా టీచర్ల బదిలీలు చేపట్టాల్సిన అవసరమేంటని ఆలిండియా పేరెంట్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బుర్ర రాముగౌడ్‌ ప్రశ్నించారు.

బదిలీల ప్రక్రియను వేసవి సెలవుల్లో చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన విన్నవించారు. ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులు దాదాపు ఐదు లక్షల మంది ఉన్నారని, ఇప్పుడు టీచర్ల బదిలీలు చేపడితే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఆయన అన్నారు.

టెన్త్‌ విద్యార్థుల కోసం టీచర్లు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారని, ఈ సమయంలో బదిలీలు జరిగితే విద్యార్థులు నష్టపోతారని తెలిపారు. ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా.. వేసవి సెలవుల్లో బదిలీలు చేపట్టాలని కోరారు. బదిలీలు చేసినా.. విద్యాసంవత్సరం చివరి పని దినాన వారిని రిలీవ్‌ చేయాలని సూచించారు.

Updated On 2 Feb 2023 1:13 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story