Udaya Samudram విధాత: లక్ష ఎకరాలకు సాగు నీరు అందించే బ్రాహ్మణ వెళ్ళంల పానగల్ ఉదయ సముద్రం(Udaya Samudram) ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. బుధవారం సాయంత్రం ఇంజనీరింగ్ అధికారులు ట్రయల్ రన్ కు ఏర్పాట్లు చేసారు. రాత్రి 10 గంటలకు మోటార్లు రన్ చేసి విజయవంతంగా నీళ్లను ఎత్తి పోశారు. చౌడంపల్లి శివారులోని పంపు హౌస్ వద్ద మోటార్లు ఆన్ చెసి పరీక్షించారు. పంపు హౌస్ నుంచి బ్రాహ్మణ వెళ్ళేంల శివారులోని రిజర్వాయర్ […]

Udaya Samudram

విధాత: లక్ష ఎకరాలకు సాగు నీరు అందించే బ్రాహ్మణ వెళ్ళంల పానగల్ ఉదయ సముద్రం(Udaya Samudram) ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. బుధవారం సాయంత్రం ఇంజనీరింగ్ అధికారులు ట్రయల్ రన్ కు ఏర్పాట్లు చేసారు. రాత్రి 10 గంటలకు మోటార్లు రన్ చేసి విజయవంతంగా నీళ్లను ఎత్తి పోశారు.

చౌడంపల్లి శివారులోని పంపు హౌస్ వద్ద మోటార్లు ఆన్ చెసి పరీక్షించారు. పంపు హౌస్ నుంచి బ్రాహ్మణ వెళ్ళేంల శివారులోని రిజర్వాయర్ లోకి నీటిని పంపు చేయగలిగారు. అధికారులతో పాటు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా అర్ధరాత్రి వరకు ప్రాజెక్ట్ వద్దనే ఉండి ట్రయల్ రన్ ను పర్యవేక్షించారు. ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేసారు. ప్రాజెక్టు పూర్తిలో అధికారుల కృషిని ఈ సందర్బంగా ఎమ్మెల్యే లింగయ్య అభినందించారు.


నకిరేకల్ నియోజక వర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రత్యేకంగా ప్రజల తరుపున ధన్యవాదములు తెలిపారు. ప్రాజెక్ట్ పనుల విషయంలో యువ నేత కేటీఆర్, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిలు సంపూర్ణ సహకారం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ ద్వారా నీటిని ఎత్తిపోసి సాగునీరు అందిస్తామని ప్రకటించారు. 16 మెగావాట్ల రెండు పంపుసెట్ల ద్వారా రిజర్వాయర్ లోకి నీటిని పంపింగ్ చేశారు. ప్రస్తుతం అనధికారికంగా ట్రయల్ రన్ నిర్వహించగా, ప్రభుత్వం తరఫున అధికారికంగా ట్రయల్‌ నిర్వహించాల్సివుంది.

Updated On 4 May 2023 6:50 AM GMT
Somu

Somu

Next Story