Trolling on Uttam
విధాత: తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగుతున్న వ్యవహారంపై ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ట్రోలింగ్ నిర్వాకం యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జి ప్రశాంత్ పనేనని గుర్తించారు.
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు తమకు వ్యతిరేకంగా సాగుతున్న ట్రోలింగ్ పై మే 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై ఒకే నెంబర్ నుండి ట్రోలింగ్ సాగుతున్నట్లుగా ఉత్తమ్ చేసిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ప్రశాంత్ నిర్వాకాన్ని బట్టబయలు చేశారు.
సొంత పార్టీకి చెందిన యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ ఇన్చార్జి ప్రశాంత్ తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టడం పట్ల అంతా విస్మయం వ్యక్తం చేశారు ప్రశాంత్ స్వయంగా ఈ పనికి పాల్పడి ఉండకపోవచ్చని ఆయనతో ఎవరో పార్టీలోని తన వ్యతిరేకులే ఈ పని చేయించి ఉంటారని ఉత్తమ్ అనుమానిస్తున్నారు. గతంలో భట్టి విక్రమార్క సైతం తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టుల పట్ల ఫిర్యాదు చేయడం గమనార్హం.
ప్రశాంత్ నిర్వాకం వెలుగులోకి రాగానే యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ ఇన్చార్జిగా అతనినీ తొలగించుతున్నట్లుగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ప్రకటించారు. మొత్తం మీద సొంత పార్టీ నేతలే ఉత్తమ్, జగ్గారెడ్డిలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టించారన్న అనుమానాల నేపధ్యం కాంగ్రెస్ సీనియర్లలో కలకలం రేపుతుంది.