TRT సుప్రీంకోర్టు తీర్పు అమలు విధాత‌: సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (SGT) ఉద్యోగాలకు బీఈడీ చేసిన వారు అర్హులు కాదని, డీఎడ్‌ చదివిన వారు మాత్రమే అర్హులని ఇటీవల రాజస్థాన్‌కు సంబంధించిన కేసులో ఆ రాష్ట్ర కోర్టు తీర్పు చెప్పగా.. సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించిన సంగతి తెలిసిందే. ఇదే తీర్పును తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో విద్యాశాఖ తాజా నిర్ణయంతో వారందరూ పేపర్‌-1కు హాజరయ్యే అవకాశం లేకుండాపోయింది. మరోవైపు టీఆర్‌టీ […]

TRT

  • సుప్రీంకోర్టు తీర్పు అమలు

విధాత‌: సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (SGT) ఉద్యోగాలకు బీఈడీ చేసిన వారు అర్హులు కాదని, డీఎడ్‌ చదివిన వారు మాత్రమే అర్హులని ఇటీవల రాజస్థాన్‌కు సంబంధించిన కేసులో ఆ రాష్ట్ర కోర్టు తీర్పు చెప్పగా.. సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించిన సంగతి తెలిసిందే. ఇదే తీర్పును తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయనున్నారు.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో విద్యాశాఖ తాజా నిర్ణయంతో వారందరూ పేపర్‌-1కు హాజరయ్యే అవకాశం లేకుండాపోయింది. మరోవైపు టీఆర్‌టీ (TRT)ని ఈసారి ఆన్‌లైన్‌ విధానంలో జరపాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఏ పోస్టుకు ఏ విద్యార్హత ఉండాలన్న దానిపై స్పష్టతను ఇస్తూ నేడో.. రేపో విద్యాశాఖ జీవో జారీచేయనున్నది. అలాగే ఈ నెల రెండో వారంలో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

2017 జులై నిర్వహించిన టీఆర్‌టీలో 8,792 టీచర్‌ కొలువులకు 2.75 లక్షల మంది అభ్యర్థులు పోటీపడ్డారు. అప్పుడు ఉమ్మడి జిల్లాల వారీగా ఉద్యోగాలు భర్తీ చేశారు. ఈసారి 5,089 ఉద్యోగాలను కొత్త జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. దీనివల్ల కొన్నిపోస్టులకు కొన్ని జిల్లాల్లో పోస్టులు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. తాజాగా ఉపాధ్యాయుల పదోన్నతులకు, బదిలీలకు ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది.

అక్టోబర్‌ 3వ తేదీ వరకు ఆ ప్రక్రియ పూర్తి చేయనున్నది. ప్రమోషన్ల ద్వారా 70 శాతం, 30 శాతం డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా నింపనున్నారు. పోస్టులు తక్కువగా ఉన్నాయని సీఎం అసెంబ్లీ ఇచ్చిన హామీ మేరకు 11,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని నిరుద్యోగ అభ్యర్థులు నిరసనలు తెలుపుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నది అన్నది చూడాలి.

Updated On 6 Sep 2023 7:51 AM GMT
somu

somu

Next Story