హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ తో పాటు ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించే విశ్వవిద్యాలయాల కన్వీనర్ల పేర్లను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది.
ఎంసెట్, పీజీ సెట్ ను హైదరాబాద్ జెఎన్ టియుకి అప్పగించారు. లా సెట్, పీజీ లా సెట్ ను ఉస్మానియా వర్సిటీ (ఓయూ)కి, ఎడ్ సెట్ ను నల్లగొండ లోని మహాత్మా గాంధీకి, పిఈ సెట్ ను కరీంనగర్ శాతవాహన కు అప్పగించారు. ఐ సెట్ ను కాకతీయ విశ్వ విద్యాలయాని(కెయు)కి ఉన్నత విద్యా మండలి కట్టబెట్టింది.