Saturday, April 1, 2023
More
    HomelatestTS New Secretariat | తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు..! పనులను పరిశీలించిన...

    TS New Secretariat | తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు..! పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌

    TS New Secretariat | తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 30న సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి సెక్రటేరియట్‌ నిర్మాణ పనులను శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించనున్నారు.

    నిన్న జరిగిన కేబినెట్‌లో జూన్‌ 2వ తేదీ నాటికి సెక్రటేరియట్‌, అంబేద్కర్‌ విగ్రహం, అమరవీరుల స్థూపాలకు ప్రారంభోత్సం చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అంబేద్కర్‌ జయంతి రోజు విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. అదే నెల 30న సెక్రటేరియట్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్‌ 2న అమరవీరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

    వాస్తవానికి సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17న తెలంగాణ సెక్రటేరియట్‌ను ప్రారంభించాల్సి ఉంది. ఎన్నికల కోడ్ రావడంతో సచివాలయం ప్రారంభోత్సవం ఆగిపోయింది. ప్రారంభోత్సవానికి నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించగా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ రావడంతో బ్రేక్‌ పడింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొత్త సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నది.

    తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్మిస్తున్నది.కొత్త సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరును పెట్టిన విషయం తెలిసిందే. ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో ఆకర్షణలతో ప్రభుత్వం సచివాలయ నిర్మాణం చేపడుతున్నది. 2019, జూన్‌ 27న కొత్త సచివాలయానికి భూమిపూజ చేయగా.. నాలుగేళ్లలోనే దాదాపు పనులన్నీ పూర్తికావొచ్చాయి.

    రూ.610కోట్ల వ్యయంతో సచివాలయం రూపుదిద్దుకుంటున్నది. తెలంగాణ అలనాటి వైభవానికి ఏమాత్రం తీసిపోకుండా సరికొత్త హంగులతో సచివాలయాన్ని 11.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నది. ఎత్తు 278 అడుగులు ఉండగా.. గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిసి మొత్తం ఏడు ఫ్లోర్లతో నిర్మిస్తున్నది. రూఫ్ టాప్‌లో స్కై లాంజ్ సచివాలయానికి ప్రత్యేక నిలుస్తున్నది. అలాగే ఆహ్లాదకరమైన పార్కులతో సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు పటిష్టమైన భద్రత మధ్య సచివాలయం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నది.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular