Saturday, April 1, 2023
More
    HomelatestTSPSC: టీఎస్‌పీఎస్‌ ముట్టడి.. పేపర్‌ లీక్‌ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాల‌ని NSUI డిమాండ్‌

    TSPSC: టీఎస్‌పీఎస్‌ ముట్టడి.. పేపర్‌ లీక్‌ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాల‌ని NSUI డిమాండ్‌

    TSPSC, NSUI, HANITRAOP

    విధాత: పేపర్‌ లీక్‌, హానీ ట్రాప్‌(HANITRAOP) వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌ ఎస్‌యూఐ(NSUI) కార్యకర్తలు సోమవారం టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) కార్యాలయాన్ని ముట్టడించారు. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం గేటు ఎక్కి కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ఆందోళనకారులు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. కేటీఆర్‌ డౌన్ డౌన్‌ అంటూ నినదించారు. కార్యాలయం ముందు బైఠాయించిన ఎన్‌ ఎస్‌యూఐ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు.

    ఆదివారం జరగాల్సిన టౌన్‌ప్లానింగ్‌ ఎగ్జామ్‌ పేపర్‌ లికేజీకి సంబంధించిన ఉన్నతాధికారులను టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ జనార్థన్‌రెడ్డిలను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే ఈ కేసులో ఉన్నతాధికారులను వదిలేసి ఒక పీఏని దోషిగా చూపిస్తున్నారని ఆరోపించారు. దీనిపై సత్వర విచారణ చేయాలని ఎన్‌ఎస్‌యూఐ డిమాండ్‌ చేసింది. అంతే కాకుండా ఇంత వరకు జరిగిన పరీక్షలపై కూడా అవకతవకలు జరిగినట్లు ఎన్‌ఎస్‌యూఐ అనుమానం వ్యక్తం చేసింది. ఈ పేపర్‌ను రూ.14 ల క్షలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేసింది.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular