విధాత: గ్రూప్‌-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష క‌ఠినంగా వ‌చ్చిందని, క‌టాఫ్ మార్కులు ఎంత అని సోష‌ల్‌మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ దీనిపై టీఎస్పీఎస్సీ స్పందించింది. క‌టాఫ్ మార్కుల‌పై స్ప‌ష్ట‌త ఇచ్చింది. గ్రూప్‌-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌లో క‌నీస అర్హ‌త మార్కులు ఉండ‌వు. ప్రిలిమిన‌రీ ప‌రీక్ష కేవ‌లం వ‌డ‌బోత ప‌రీక్ష మాత్ర‌మే. మెయిన్స్‌కు అభ్య‌ర్థుల ఎంపిక విధానంలో మార్పులు జ‌రిగాయి. మ‌ల్టీజోన్‌, రిజ‌ర్వేష‌న్ ప్ర‌కారం మెయిన్స్‌కు ఎంపిక చేస్తాం. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తామ‌ని […]

విధాత: గ్రూప్‌-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష క‌ఠినంగా వ‌చ్చిందని, క‌టాఫ్ మార్కులు ఎంత అని సోష‌ల్‌మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ దీనిపై టీఎస్పీఎస్సీ స్పందించింది.

క‌టాఫ్ మార్కుల‌పై స్ప‌ష్ట‌త ఇచ్చింది. గ్రూప్‌-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌లో క‌నీస అర్హ‌త మార్కులు ఉండ‌వు. ప్రిలిమిన‌రీ ప‌రీక్ష కేవ‌లం వ‌డ‌బోత ప‌రీక్ష మాత్ర‌మే.

మెయిన్స్‌కు అభ్య‌ర్థుల ఎంపిక విధానంలో మార్పులు జ‌రిగాయి. మ‌ల్టీజోన్‌, రిజ‌ర్వేష‌న్ ప్ర‌కారం మెయిన్స్‌కు ఎంపిక చేస్తాం. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తామ‌ని టీఎస్పీఎస్సీ చేస్తామ‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Updated On 17 Oct 2022 4:49 PM GMT
krs

krs

Next Story