TSPSC leakage case విధాత‌: టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. సిట్ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. 37మంది నిందితులను అభియోగపత్రంలో చేర్చనున్నది. న్యాయసలహా తీసుకొని వచ్చే వారంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసే యోచనలో సిట్ ఉన్నది. ఈ కేసులో సిట్ అధికారులు ఇప్పటి వరకు 50మందిని అరెస్ట్ చేయగా 15మంది నిందితులు బెయిల్ పై బయటికి వచ్చారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో పాటు […]

TSPSC leakage case

విధాత‌: టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. సిట్ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. 37మంది నిందితులను అభియోగపత్రంలో చేర్చనున్నది.

న్యాయసలహా తీసుకొని వచ్చే వారంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసే యోచనలో సిట్ ఉన్నది. ఈ కేసులో సిట్ అధికారులు ఇప్పటి వరకు 50మందిని అరెస్ట్ చేయగా 15మంది నిందితులు బెయిల్ పై బయటికి వచ్చారు.

ప్రధాన నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో పాటు మిగతా నిందితులు జైల్లోనే ఉన్నారు. అనుబంధ అభియోగపత్రంలో మిగతా నిందితులను చేర్చే ఆలోచన సిట్ అధికారులు ఉన్నారు.

ఏఈ పూల రమేష్ అరెస్ట్ తో ప్రశ్నాపత్రాల కేసు కొత్త మలుపు తిరిగింది.పూల రమేష్ హైటెక్ మాస్ కాపీయింగ్ చేయించాడు. ఏఈ ప్రశ్నాపత్రాన్ని దాదాపు 80మందికి విక్రయించాడు. ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది

Updated On 7 Jun 2023 4:03 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story