ఆర్టీసీ చరిత్రలో ఆల్ టైం రికార్డు ఆదాయం TSRTC | విధాత: రాఖీ పండుగ ఆర్టీసీ సంస్థకు కాసులు కురిపించింది. గురువారం పండుగ సందర్భంగా ఒక్కరోజే టీఎస్ఆర్టీసి రూ.22.65కోట్ల ఆదాయం ఆర్జించింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డ్. గతేడాది రాఖీ రోజు రూ.21.66కోట్ల ఆదాయం రాగా ఈ సంవత్సరం 40.92 లక్షల మంది ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించారు. రాఖీ పౌర్ణమి పర్వదినం నాడు #TSRTC సరికొత్త రికార్డులను నమోదు చేసింది. నిన్న ఒక్క రోజే […]

- ఆర్టీసీ చరిత్రలో ఆల్ టైం రికార్డు ఆదాయం
TSRTC | విధాత: రాఖీ పండుగ ఆర్టీసీ సంస్థకు కాసులు కురిపించింది. గురువారం పండుగ సందర్భంగా ఒక్కరోజే టీఎస్ఆర్టీసి రూ.22.65కోట్ల ఆదాయం ఆర్జించింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డ్. గతేడాది రాఖీ రోజు రూ.21.66కోట్ల ఆదాయం రాగా ఈ సంవత్సరం 40.92 లక్షల మంది ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించారు.
రాఖీ పౌర్ణమి పర్వదినం నాడు #TSRTC సరికొత్త రికార్డులను నమోదు చేసింది. నిన్న ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు. గత ఏడాది రాఖీ పండుగ(12.08.2022) నాడు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా.. ఈ సారి దాదాపు రూ.కోటి వరకు అదనంగా ఆర్జించింది. ఈ…
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) September 1, 2023
ఒకే రోజు ఇంతమంది ప్రయాణించడం కూడా ఇదే తొలిసారి. 20 డిపోల్లో ఆక్యుపెన్సీ రేషియో 100% పైగా నమోదు కాగా.. ఉమ్మడి నల్గొండ వరుసగా రెండో ఏడాది కూడా తొలిస్థానంలో నిలిచింది.
