Srisailam | ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్‌కు టీఎస్ ఆర్టీసీ బస్సు బయల్దేరింది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు రాగానే మూలమలుపు వద్ద బస్సు నియంత్రణ కోల్పోయింది. వేగాన్ని నియంత్రించలేక.. బస్సు మలుపును ఢీకొట్టింది. దీంతో రక్షణ గోడ పగిలిపోయింది. రేయిలింగ్ ఉండటంతో బస్సు లోయలో పడలేదు.
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. 30 మంది ప్రయాణికులు సేఫ్ pic.twitter.com/jyIDP3rqv7
— vidhaathanews (@vidhaathanews) January 29, 2023
తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు బస్సులో నుంచి కిందకు దిగేశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం నుంచి శ్రీశైలం మల్లికార్జునస్వామి కాపాడారని భక్తులు పేర్కొన్నారు. ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు.