TSRTC | సంక్రాంతి పండుగ వేళ టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంక్రాంతికి తమ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే రాయితీలు ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. రానుపోను టికెట్లను ఒకేసారి బుక్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొంది.
ఈ రాయితీ సదుపాయం డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో లభించనుంది. అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్‌కు ఈ రాయితీ వర్తిస్తుందని, వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఇది అమల్లో ఉంటుంది. ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకొన్నట్టు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. తదితర వివరాల కోసం www.tsrtconline.in వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు.