విధాత: భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీదేవస్థానమ్స్ డిజిటల్ యాప్ ప్రారంభిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టినట్లు ఆయన వివరించారు. భక్తుల సేవల కోసం ఇప్పటివరకు గోవింద మొబైల్ యాప్‌ను ఉండేదని, దాన్ని ఆధునీకరించి మరిన్ని అదనపు హంగులు సమకూర్చి నూతనంగా టీటీ దేవస్థానమ్స్ రూపొందించామన్నారు.
ఈ మొబైల్ యాప్‌లో శ్రీవారి దర్శనం, శ్రీవారి సేవలు బుక్ చేసుకోవచ్చని సుబ్బారెడ్డి తెలిపారు. విరాళాలు కూడా ఇదే యాప్ నుంచి అందించవచ్చని, పుష్ నోటిఫికేషన్ల ద్వార తిరుమల ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగానే తెలుసుకోవచ్చని అన్నారు.
TTDevasthanams mobile app is launched by Sri @yvsubbareddymp, TTD Chairman and Sri AV Dharma Reddy garu, EO TTD. The app now enables pilgrims to avail Darshanam, accommodation bookings. Please download the app and seek Sri Venkateswara swamy blessings. #TTD #TTDevasthanams pic.twitter.com/hOqe1zYPh6
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) January 27, 2023
ఇవే కాకుండా ఎస్.వి.బి.సి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాలను చూడవచ్చన్నారు. తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారం ఈ యాప్ లో పొందుపర్చామని, రిలయన్స్ జియో సహకారంతో టీటీ దేవస్థానమ్స్ యాప్‌ను https://play.google.com/store/apps/details?id=com.ttdapp రూపొందించామన్నారు.
ప్రతి నెలా దర్శనం, సేవలు, శ్రీవాణి టికెట్లతో పాటు తిరుమలలో వసతి సౌకర్యాలను బుక్ చేసుకోవచ్చని సుబ్బారెడ్డి చెప్పారు. నూతన్ యాప్ పై భక్తుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించి మెరుగుపర్చుతామని ఆయన వివరించారు. కార్యక్రమంలో టిటిడి ఈఒ ఎవి.ధర్మారెడ్డి, జెఈఒ వీరబ్రహ్మం, జియో ఫ్లాట్ ఫ్లామ్స్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనీష్ షా పాల్గొన్నారు.