విధాత: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి గుండెపోటుకు గురయ్యాడు. చెన్నైలో ఉంటున్న చంద్రమౌళి ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుకు గురవడంతో, అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం చంద్రమౌళికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చంద్రమౌళి అకస్మాత్తుగా గుండెపోటుకు గురవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
జనవరిలో చంద్రమౌళి వివాహం..
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి, ప్రముఖ పారిశ్రామికవేత్త శేఖర్‌రెడ్డి కుమార్తె భాగ్యశ్రీ నిశ్చితార్థం ఈ ఏడాది జూన్ 9వ తేదీన తిరుమలలో జరిగింది. స్థానిక చిన్నజీయర్ మఠంలో పరిమిత కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది.
2023, జనవరి నెలలో చంద్రమౌళి, భాగ్యశ్రీకి వివాహం చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. కానీ అంతలోనే చంద్రమౌలి గుండెపోటుకు గురవడం తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది.