TTD
- ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు..
- అద్దె గదులు ఏప్రిల్ 26న విడుదల..!
విధాత: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతారు. అసలే వేసవి కాలం.. సెలవుల కాలం కావడంతో ఎక్కువ మంది భక్తులు స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటారు. అలాంటి భక్తులకు టీటీడీ(TTD) శుభవార్త తెలిపింది. మే, జూన్ రెండు నెలలకు సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్లను ఒకేసారి విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.
మే, జూన్ నెలలకు సంబధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని తెలిపింది. ఈ http://tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ లేదా tt devasthanams యాప్‌లో మీ వివరాలను నమోదు చేసి టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలియజేసింది.
అలాగే మే, జూన్ రెండు నెలలకు సంబంధించి తిరుమలలో అకామడేషన్ కోటాను ఏప్రిల్ 26న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇవి కూడా తిరుపతి అధికారిక వెబ్‌సైట్, యాప్‌లోనే అందుబాటులో ఉంటాయని TTD తెలియజేసింది.
తిరుమల స్వామి వారి దర్శన, వసతికి సంబంధించిన టికెట్లకు అధిక డిమాండ్ ఉంటుందనేది విషయం అందరికి తెలిసిందే. కావున భక్తులు త్వరపడి అలర్ట్‌గా ఉండి టికెట్లు విడుదల చేసిన వెంటనే వెబ్‌సైట్ సందర్శించి ప్రయత్నిస్తే త్వరగా సులభంగా టికెట్లు పొందే అవకాశం ఉంది.