Twins | వాళ్లిద్ద‌రూ క‌వ‌ల పిల్ల‌లు.. కానీ వేర్వేరు సంవ‌త్స‌రాలు, వేర్వేరు నెల‌లు, వేర్వేరు తేదీల్లో పుట్టారు. ఈ క‌వ‌ల‌ల మ‌ధ్య 6 నిమిషాల తేడాతో.. ఇద్ద‌రి సంవ‌త్స‌రాలు మారిపోయాయి. ఈ అరుదైన ఘ‌ట‌న అమెరికాలోని టెక్సాస్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. కాలీ జో, క్లిఫ్ దంప‌తులు టెక్సాస్‌లో నివాసం ఉంటున్నారు. కాలీ జోకు నెల‌లు నిండ‌టంతో డిసెంబ‌ర్ 31వ తేదీన పురిటి నొప్పులు వ‌చ్చాయి. దీంతో ఆమెను భ‌ర్త క్లిఫ్ ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. 2022, […]

Twins | వాళ్లిద్ద‌రూ క‌వ‌ల పిల్ల‌లు.. కానీ వేర్వేరు సంవ‌త్స‌రాలు, వేర్వేరు నెల‌లు, వేర్వేరు తేదీల్లో పుట్టారు. ఈ క‌వ‌ల‌ల మ‌ధ్య 6 నిమిషాల తేడాతో.. ఇద్ద‌రి సంవ‌త్స‌రాలు మారిపోయాయి. ఈ అరుదైన ఘ‌ట‌న అమెరికాలోని టెక్సాస్‌లో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. కాలీ జో, క్లిఫ్ దంప‌తులు టెక్సాస్‌లో నివాసం ఉంటున్నారు. కాలీ జోకు నెల‌లు నిండ‌టంతో డిసెంబ‌ర్ 31వ తేదీన పురిటి నొప్పులు వ‌చ్చాయి. దీంతో ఆమెను భ‌ర్త క్లిఫ్ ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. 2022, డిసెంబ‌ర్ 31న రాత్రి 11:55 గంట‌ల‌కు ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అనంత‌రం 2023, జ‌న‌వ‌రి 1వ తేదీన 12:01 గంట‌ల‌కు మ‌రో అమ్మాయికి జ‌న్మ‌నిచ్చింది. వీరిద్ద‌రి మ‌ధ్య 6 నిమిషాల తేడా ఉండ‌టంతో.. క‌వ‌ల‌ల తేదీలు, నెల‌లు, సంవ‌త్స‌రాలు మారిపోయాయి.

ఈ విష‌యాన్ని కాలీ జో, క్లిఫ్ దంప‌తులు ఫేస్‌బుక్ వేదిక‌గా వెల్ల‌డించారు. క‌వ‌ల పిల్ల‌లు జ‌న్మించ‌డంతో త‌మ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయింద‌న్నారు. పిల్ల‌ల‌కు అన్నీ జో, ఈఫీ రోజ్ స్కాట్ అని నామ‌క‌ర‌ణం చేశారు. ఈ క‌వ‌ల పిల్ల‌ల‌ను మీకు ప‌రిచ‌యం చేయ‌డం తాను, క్లిఫ్ గ‌ర్వంగా ఫీల‌వుతున్నామ‌ని కాలీ జో తెలిపింది. క‌వ‌ల‌లు ఆరోగ్యంగా ఉన్నార‌ని, 5.5 పౌండ్ల బ‌రువు ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

Updated On 8 Jan 2023 1:57 AM GMT
subbareddy

subbareddy

Next Story