Telangana | విధాత‌: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌, తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మ‌ధ్య మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది. ట్విట్ట‌ర్ వేదికగా ఒక‌రికొక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఢిల్లీ, గ‌ల్లీలో మోక‌రిల్ల‌డ‌మే కాంగ్రెస్ పార్టీ నైజం అని క‌విత ట్వీట్ చేయ‌గా, రేవంత్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. గ‌ల్లీలో స‌వాల్.. ఢిల్లీలో వంగి వంగి మోక‌రిల్లి వేడుకోలు అంటూ రేవంత్ రెడ్డి ఘాటుగా బ‌దులిచ్చారు. 🔥గల్లీలో సవాల్లు…ఢిల్లీలో వంగి వంగి […]

Telangana | విధాత‌: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌, తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మ‌ధ్య మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది. ట్విట్ట‌ర్ వేదికగా ఒక‌రికొక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఢిల్లీ, గ‌ల్లీలో మోక‌రిల్ల‌డ‌మే కాంగ్రెస్ పార్టీ నైజం అని క‌విత ట్వీట్ చేయ‌గా, రేవంత్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. గ‌ల్లీలో స‌వాల్.. ఢిల్లీలో వంగి వంగి మోక‌రిల్లి వేడుకోలు అంటూ రేవంత్ రెడ్డి ఘాటుగా బ‌దులిచ్చారు.

అస‌లేం జ‌రిగిందంటే..

బెంగ‌ళూరు వేదిక‌గా క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్, రేవంత్ రెడ్డి చ‌ర్చ‌లు నిర్వ‌హించిన ఫోటోను క‌విత త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశారు. అప్పుడు ఢిల్లీ.. ఇప్పుడు ఢిల్లీ.. కానీ ఇప్పుడు వ‌యా బెంగ‌ళూరు అంటూ ఆమె పేర్కొన్నారు. అంటే బెంగ‌ళూరు కేంద్రంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయాలు చేస్తోంద‌ని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం.. ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం అని క‌విత త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

క‌విత ట్వీట్‌పై రేవంత్ రెడ్డి స్పందించారు. గల్లీలో సవాళ్లు చేయ‌డం.. ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడుకోవ‌డం బీఆర్ఎస్ పార్టీకి స‌హ‌జ‌మేన‌ని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కేసీఆర్ మోదీకి వంగి దండం పెట్టిన ఫోటోను రేవంత్ ట్యాగ్ చేశారు. ఇది కేసీఆర్ మ్యాజిక్కు.. జగమెరిగిన 'నిక్కర్'…లిక్కర్… లాజిక్కు అని సెటైర్లు వేశారు రేవంత్.

Updated On 2 Sep 2023 7:08 AM GMT
somu

somu

Next Story