విధాత: కేటీఆర్, బండి సంజయ్‌ల మధ్య ఉగాది పంచాంగం నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా సాగిన సెటైరికల్ పంచాంగం రాజకీయ పంచ్‌లతో ట్విట్టర్ మోత మోగింది. ప్రధాని మోడీ పాలనపై ఉగాది పంచాంగాన్ని ఆసరాగా చేసుకొని కేటీఆర్ వ్యంగ్యంగా ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు.
కేటీఆర్ తన ట్వీట్‌లో ఆదాయం ఆదానికి, వ్యయం జనానికి, బ్యాంకులకు, అవమానం నెహ్రూకు, రాజపూజ్యం గుజరాతీ గుంపునకు.. బబ్రాజీ మానం భజగోవిందం.. దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం అని ట్వీట్ చేశారు.
As forwarded 👇😁
ఆదాయం: అదానీకి!
వ్యయం: జనానికి, బ్యాంకులకు!అవమానం: నెహ్రూకి!
రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి!!బస్, బభ్రాజీమానం భజగోవిందం!
దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!— KTR (@KTRBRS) March 22, 2023
కౌంటర్‌గా బండి సంజయ్ కూడా సీఎం కేసీఆర్ పాలనపై పంచాంగం పద్ధతిలోనే సెటైర్లతో కూడిన ట్వీట్‌లతో పంచ్‌లు వేశారు. ఆదాయం కల్వకుంట్ల కుటుంబానికి, వ్యయం తెలంగాణ రాష్ట్రానికి, అవమానం ఉద్యమ వీరులకు, రాజపూజ్యం ఉద్యమ ద్రోహులకు, దొంగలకు, పిట్టలదొర.. తుపాకీ చంద్రుల గడీల పంచాయతీ లెక్కతేలుడే తరువాయి అని ట్వీట్ చేశారు.
వారిద్దరి పంచాంగం సెటైర్లు చదివిన జనం కేటీఆర్, బండిలలో ఎవ్వరూ కూడా తగ్గేదే లేదన్నట్లుగా ట్వీట్ల పోరు సాగించి ఆ పార్టీల పొలిటికల్ వార్‌లో మరింత హీట్ పెంచారని అభిప్రాయపడ్డారు.
As forwarded 👇
ఆదాయం : కల్వకుంట్ల కుటుంబానికి
వ్యయం : తెలంగాణ రాష్ట్రానికిఅవమానం : ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు
రాజపూజ్యం : ఉద్యమ ద్రోహులకు, దొంగలకు !!తుస్.., పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాతీ లెక్క తేలుడే తరువాయి…పతనం ఇగ షురువాయే.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 22, 2023