జీ-20 సమ్మిట్ నేపథ్యంలో దుశ్చర్య ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు Delhi Metro | విధాత: దేశ రాజధానిలో జీ-20 దేశాల సమ్మిట్ నేపథ్యంలో మెట్రో స్టేషన్ గోడలపై ఐదుచోట్ల ఖలిస్థాన్ అనుకూల నినాదాలు రాసిన ఘటనలో ఇద్దరు నిందితులను గురువారం ఢిల్లీ పోలీసులు అరెస్టుచేశారు. ఈ కేసులో పంజాబ్‌లో ఇద్దరిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పోలీస్ అధికారి సుమన్ నల్వా తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. " ఢిల్లీ బనేగా […]

- జీ-20 సమ్మిట్ నేపథ్యంలో దుశ్చర్య
- ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
Delhi Metro | విధాత: దేశ రాజధానిలో జీ-20 దేశాల సమ్మిట్ నేపథ్యంలో మెట్రో స్టేషన్ గోడలపై ఐదుచోట్ల ఖలిస్థాన్ అనుకూల నినాదాలు రాసిన ఘటనలో ఇద్దరు నిందితులను గురువారం ఢిల్లీ పోలీసులు అరెస్టుచేశారు. ఈ కేసులో పంజాబ్‌లో ఇద్దరిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పోలీస్ అధికారి సుమన్ నల్వా తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
" ఢిల్లీ బనేగా ఖలిస్తాన్, ఖలిస్తాన్ జిందాబాద్" అంటూ శివాజీపార్క్, మదిపూర్, పశ్చిమ్ విహార్, ఉద్యోగ్ నగర్, మహరాజ సురాజ్‌మల్ స్టేడియం, మెట్రో స్టేడియం వంటి ప్రాంతాల్లో ఆగస్టు 27న నినాదాలు రాశారు. నంగ్లోయ్‌లోని ప్రభుత్వ పాఠశాల గోడలపై కూడా ఖలిస్తాన్ అనుకూల నిదానాలను గుర్తించారు. అన్ని ప్రాంతాల్లో రాసిన నినాదాలు తుడిపివేయించిన పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు.
