Prayagraj 11 మద్యం సీసాలు, రూ.1,38,000 నగదు స్వాధీనం ట్రైన్‌లో మద్యం అమ్ముతున్న ఇద్దరు టీసీలు సస్పెండ్ విధాత: రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించే వారిని, మద్యం సేవించే వారిని పట్టుకోవడం ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) విధులు. కానీ, కంచె చేను మేసినట్టుగా, అడ్డుకోవాల్సిన అధికారులే ఏకంగా మద్యం అమ్మకాలకు దిగితే వారిని ఏమనాలి! ఈ ఇద్దరు టీటీఈలు ఏకంగా ట్రైన్‌లోనే బెల్ట్‌షాపు ఓపెన్ చేశారు. రైళ్లలోనే ఏకంగా మద్యం అమ్మకాలు మొదలు పెట్టారు. ఆర్‌కె […]

Prayagraj
- 11 మద్యం సీసాలు, రూ.1,38,000 నగదు స్వాధీనం
- ట్రైన్‌లో మద్యం అమ్ముతున్న ఇద్దరు టీసీలు సస్పెండ్
విధాత: రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించే వారిని, మద్యం సేవించే వారిని పట్టుకోవడం ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) విధులు. కానీ, కంచె చేను మేసినట్టుగా, అడ్డుకోవాల్సిన అధికారులే ఏకంగా మద్యం అమ్మకాలకు దిగితే వారిని ఏమనాలి! ఈ ఇద్దరు టీటీఈలు ఏకంగా ట్రైన్‌లోనే బెల్ట్‌షాపు ఓపెన్ చేశారు. రైళ్లలోనే ఏకంగా మద్యం అమ్మకాలు మొదలు పెట్టారు.
ఆర్‌కె యాదవ్, రామ్ లఖన్ టీటీఈలు. ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్‌లో వీరు మద్యం అమ్మకాలు జరిపేవారు. ఎవరో ప్రయాణికులు వీరి అక్రమాలపై అవినీతి నిరోధకశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల విజిలెన్స్ అధికారులు ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు చేపట్టారు.
టీటీఈలు ఆర్‌కె యాదవ్, రామ్ లఖన్ ప్రయాణికులకు మద్యం విక్రయిస్తున్నట్టు గుర్తించారు. సోదాల్లో 11 మద్యం సీసాలు, రూ.1,38,000 నగదు పట్టుకున్నారు. వారిద్దరిని అధికారులు సస్పెండ్ చేశారు. శాఖ పరమైన విచారణకు ఆదేశించారు
