విధాత: అందమైన అమ్మాయి క‌నిపించిందంటే చాలు మ‌న‌సు పారేసుకుంటాం. ఆ అమ్మాయిని ఎలాగైనా ప్రేమించాల‌నుకుంటాం. మ‌న వ‌ల‌లో వేసుకునేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తాం. అయిన‌ప్ప‌టికీ కొన్ని సంద‌ర్భాల్లో విఫ‌ల‌మ‌వుతుంటాం.. కొన్నిసార్లు విజ‌యం సాధిస్తుంటాం. ఇదంతా ఒకేత్తు అయితే.. మ‌రి ఒకే అమ్మాయి కోసం ఇద్ద‌రు అబ్బాయిలు పోటీ ప‌డితే ఎలాంటి ఉంటుంది. కాస్త క‌ష్ట‌మే. ఎవ‌రికో ఒక‌రికి మాత్రమే ఆ అమ్మాయి ద‌క్కాలి. ఆ పిల్ల నాది అంటే నాది అని ఓ ఇద్ద‌రు అబ్బాయిలు క్లాస్ […]

విధాత: అందమైన అమ్మాయి క‌నిపించిందంటే చాలు మ‌న‌సు పారేసుకుంటాం. ఆ అమ్మాయిని ఎలాగైనా ప్రేమించాల‌నుకుంటాం. మ‌న వ‌ల‌లో వేసుకునేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తాం. అయిన‌ప్ప‌టికీ కొన్ని సంద‌ర్భాల్లో విఫ‌ల‌మ‌వుతుంటాం.. కొన్నిసార్లు విజ‌యం సాధిస్తుంటాం.

ఇదంతా ఒకేత్తు అయితే.. మ‌రి ఒకే అమ్మాయి కోసం ఇద్ద‌రు అబ్బాయిలు పోటీ ప‌డితే ఎలాంటి ఉంటుంది. కాస్త క‌ష్ట‌మే. ఎవ‌రికో ఒక‌రికి మాత్రమే ఆ అమ్మాయి ద‌క్కాలి. ఆ పిల్ల నాది అంటే నాది అని ఓ ఇద్ద‌రు అబ్బాయిలు క్లాస్ రూమ్‌లోనే కొట్టుకున్న ఘ‌ట‌న ఇది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.


నీట్, జేఈఈ కోచింగ్ సెంట‌ర్‌లో ఈ గొడ‌వ చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇద్ద‌రు అబ్బాయిలు త‌ర‌గ‌తి గ‌దిలోనే త‌న్నుకున్నారు. పంచుల వ‌ర్షం కురిపించుకున్నారు. చివ‌ర‌కు టీచ‌ర్ వ‌చ్చి వారిద్ద‌రిని విడిపించారు. అమ్మాయి కోసం ఇంత‌గనం కొట్టుకోవాలా? అని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.

నీట్, జేఈఈతో పాటు అమ్మాయిల కోసం ఎలా కొట్టుకోవాలో కూడా శిక్ష‌ణ ఇస్తున్నారా? అని మ‌రో నెటిజ‌న్ ప్ర‌శ్నించాడు. ఈ వీడియోను షేర్ చేసిన కొద్ది గంట‌ల్లోనే ల‌క్ష మందికి పైగా వీక్షించారు.

Updated On 12 Oct 2022 12:26 PM GMT
krs

krs

Next Story