Tuesday, January 31, 2023
More
    Homelatest16 ,17న యూజీ ఆయుష్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు వెబ్ కౌన్సెలింగ్‌

    16 ,17న యూజీ ఆయుష్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు వెబ్ కౌన్సెలింగ్‌

    • రెండవ విడత వెబ్‌ ఆప్షన్లకు నోటిఫికేషన్
    • కాళోజీ హెల్త్ యూనివర్సిటీ

    విధాత, వరంగల్: యూజీ ఆయుష్ వైద్యవిద్య సీట్ల భర్తీకి ఈ నెల 16వ తేదీ నుండి 17 వ తేదీ వరకు రెండవ విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.

    యూనివర్సిటీ పరిధిలోని ఆయుష్‌ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్‌ఎంఎస్‌), ఆయుర్వేద (బీఏఎంఎస్‌), యునాని (బీయూఎంఎస్), నేచురోపతి-యోగా (బీఎన్‌వైసీ) కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

    ఈ నెల 16 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 17 వ తేదీ సాయంత్రం 6గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.

    అయితే ఆలిండియా కోటాలో, కాళోజీ, ఎన్టీఆర్ యూనివర్సిటీలలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో సీటు పొందిన అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సిలింగ్‌కు అనర్హులు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ http://www.knruhs.telangana.gov.in ను చూడవలసిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular