UK Man Tattoos | కూతురు అంటే ప్రతి తండ్రికి అమితమైన ప్రేమ ఉంటుంది. అంతేకాదు కంటికి రెప్పలా కాపాడుకుం టాడు. పలు సందర్భాల్లో ఏదో ఒకరకంగా కూతురుపై తండ్రి ప్రేమను చాటుకుంటాడు. ఆ మాదిరిగానే ఓ తండ్రి కూడా తన కూతురిపై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు. కూతురి పేరును తన శరీరంపై టాటూ రూపంలో వేయించుకున్నాడు. అదేదో ఒక్క టాటూ కాదు.. ఏకంగా 667 టాటూలు వేయించుకున్నాడు ఆ తండ్రి. దీంతో ప్రపంచ రికార్డును బద్దలు […]

UK Man Tattoos |
కూతురు అంటే ప్రతి తండ్రికి అమితమైన ప్రేమ ఉంటుంది. అంతేకాదు కంటికి రెప్పలా కాపాడుకుం టాడు. పలు సందర్భాల్లో ఏదో ఒకరకంగా కూతురుపై తండ్రి ప్రేమను చాటుకుంటాడు. ఆ మాదిరిగానే ఓ తండ్రి కూడా తన కూతురిపై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు.
కూతురి పేరును తన శరీరంపై టాటూ రూపంలో వేయించుకున్నాడు. అదేదో ఒక్క టాటూ కాదు.. ఏకంగా 667 టాటూలు వేయించుకున్నాడు ఆ తండ్రి. దీంతో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి మరోసారి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు.
యూకేకు చెందిన మార్క్ ఓవెన్ ఎవాన్స్(49)కు ఓ కూతురు ఉంది. ఆమె అంటే అతనికి ఎంతో ప్రేమ. ఈ క్రమంలో 2017లో కూతురు లూసీ పేరును తన వీపుపై 267 పచ్చబొట్లు వేయించుకుని ప్రపంచ రికార్డు సృష్టించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు.
అయితే ఎవాన్స్ రికార్డును 2020లో అమెరికాకు చెందిన డెడ్రా విజిల్ చెరిపేసింది. డెడ్రా తన పేరునే 300 సార్లు వేయించుకుని గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.
తాజాగా మళ్లీ ఎవాన్స్ ప్రపంచ రికార్డు సృష్టించాలనుకున్నాడు. ఈ సారి 400 టాటూలను తన కూతురి పేర వేయించుకున్నాడు. ఒంటిపై ఎక్కడ స్థలం లేకపోవడంతో.. రెండు తొడలపై టాటూలు వేయించు కుని రికార్డు సృష్టించాడు. ప్రతి తొడపై 200 టాటూలు వేయించుకున్నట్లు ఎవాన్స్ పేర్కొన్నాడు.
దీంతో గతంలో వేయించుకున్న 267 టాటూలు, ఈ 400 కలిపి మొత్తం ఎవాన్స్ శరీరంపై 667 టాటూలు ఉన్నాయి. దీంతో ఎవాన్స్‌కు మరోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది.
