Friday, December 9, 2022
More
  Homelatestఅన్‌స్టాపబుల్ 2 ప్రోమో: ఎన్టీఆర్‌ని అవమానించడానికేనా.. చంద్రబాబు?

  అన్‌స్టాపబుల్ 2 ప్రోమో: ఎన్టీఆర్‌ని అవమానించడానికేనా.. చంద్రబాబు?

  విధాత‌, సినిమా: నందమూరి బాలకృష్ణలోని రెండో యాంగిల్‌ని పరిచయం చేసిన షో ‘అన్‌స్టాపబుల్’. ఆహా ఓటీటీలో సీజన్ 1ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో.. భారీ స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. టాక్ షోలలోనే టాప్ రేటింగ్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ షో.. రెండో దరువుకి సిద్ధమైంది. ‘అన్‌ స్టాపబుల్’ రెండో సీజన్ మొదలవ్వబోతుందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టాక్ బీభత్సంగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే.

  ఈ సీజన్‌కి చంద్రబాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి వారు హాజరుకాబోతున్నట్లుగా వస్తున్న టాక్‌తో.. ఈ షో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ట్రెండ్‌కి అనుగుణంగానే రెండో సీజన్‌లో ఈ షో మొదటి ఎపిసోడ్‌కి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్‌తో కలిసి గెస్ట్‌లుగా హాజరయ్యారు.

  ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోని తాజాగా ఆహా విడుదల చేసింది. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ముఖ్యంగా బాలయ్య, చంద్రబాబు కలిసి పెద్దాయన ఎన్టీఆర్‌ని అవమానించారా? అనిపించేలా ప్రోమో ఉంది. ఈ ప్రోమో చూసిన పెద్దాయన అభిమానులు చాలా మంది ఇలాగే మాట్లాడుకుంటున్నారు.

  ప్రోమో విషయానికి వస్తే.. వెల్ కమ్ టు అన్‌స్టాపబుల్ 2 (Unstoppable2). సదా నన్ను కోరుకునే మీ అభిమానం.. అన్‌స్టాపబుల్‌ని స్టార్ షోలకి అమ్మా మొగుడుగా చేసింది. మొదటి ఎపిసోడ్‌గా నా బంధువులని పిలుద్దామని అనుకున్నా.. కానీ, ప్రజలందరి బంధువు అయితే బావుంటుందని అనిపించింది. అందుకే మీకు బాబుగారు.. నాకు బావగారు.. వెల్ కామ్.. శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు.. అంటూ బాలయ్య తన బావని ఆహ్వానించారు.

  ఆ తర్వాత ఇంట్లో జరిగే విషయాలతో చంద్రబాబుని బాలయ్య ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. కానీ బాలయ్య అడిగే ప్రతి ప్రశ్నకు చంద్రబాబు కౌంటర్‌లా సమాధానమిచ్చారు. ‘మీ లైఫ్‌లో చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏమిటి?’ అని బాలయ్య అడిగిన ప్రశ్నకు.. ‘మీ కంటే ఎక్కువే చేశా. మీరు సినిమాల్లో చేస్తారు. నేను స్టూడెంట్‌గా చేశా..’ అంటూ చంద్రబాబు తుంటరిగా సమాధానమిచ్చారు. ఇక మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పండి అని బాలయ్య అడిగిన ప్రశ్నకు.. నేను, రాజశేఖర్ రెడ్డి కలిసి బాగా తిరిగాం.. అంటూ చంద్రబాబు, వైఎస్‌ని గుర్తు చేసుకున్నారు.

  ఇక తెరపై బిగ్ డెసిషన్ అని చూపించి.. మీ లైఫ్‌లో మీరు తీసుకున్న బిగ్ డెసిషన్ ఏమిటి? అని బాలయ్య ప్రశ్నించగా.. ‘1995 డెసిషన్.. ఒక వ్యక్తిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆరోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా?’ అని చంద్రబాబు అనగా.. ‘ఆరోజు నాకింకా గుర్తుంది’ అని బాలయ్య కూడా ఆయనకి వంత పాడారు. ఈ సీన్‌లో వారు పెట్టిన ఫేస్‌లు.. వారు మాట్లాడిన తీరు.. నిజంగా పెద్దాయనని (నందమూరి తారక రామారావు) అవమానించినట్లుగానే అనిపించింది. ఆయనేదో పెద్ద తప్పు చేసినట్లుగా ఆ సన్నివేశం చిత్రీకరిస్తుంది.

  ఇక సెంటిమెంట్ సన్నివేశం తర్వాత లోకేష్ ఎంటరవడం.. ఆయనని మంగళగిరి ఎన్నికకు సంబంధించి బాలయ్య ప్రశ్నించడం.. దానికేదో లోకేష్ సమాధానమివ్వడం.. ఇలా ఇంట్రెస్ట్‌గా నడుస్తున్న ఈ షోలో కాసేపు.. నేను హోస్ట్ అంటూ.. లోకేష్.. బాలయ్యకు ప్రశ్నలు సంధించడం కూడా ఈ షో‌పై మరింతగా ఆసక్తిని క్రియేట్ చేసింది. ఓవరాల్‌గా.. ఈ ప్రోమో.. ఫస్ట్ ఎపిసోడ్‌కి కావాల్సిన వెజ్, నాన్‌వెజ్ ఐటమ్స్ అన్నింటిని బాగా రెడీ చేసి పెట్టినట్లుగా అయితే అనిపించింది. ప్రోమో వరకు ఓకే.. ఇక ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే.. రాబోయే శుక్రవారం వరకు వెయిట్ చేయక తప్పదు.

  RELATED ARTICLES

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page