Undavalli Arun Kumar అక్టోబర్ 30 లోపు ఇంకో పెద్ద తలకాయను అరెస్ట్ చేస్తారట ఉండవల్లి జోస్యం.. ఏపీలో చర్చోపచర్చలు విధాత: ఆంధ్ర పాలిటిక్స్ వేగంగా మారిపోతున్నాయి. చంద్రబాబు అరెస్ట్.. రెండువారాల జ్యుడిషియల్ రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు.. ఇక రాష్ట్రంలో టిడిపి శ్రేణుల ఆవేదన. అక్కడక్కడా ఆందోళనలు.. ఇవన్నీ ఇలా ఉండగా.. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి మరో బాంబ్ పేల్చారు. అక్టోబర్ 30 లోపు మరో పెద్ద తలకాయను పోలీసులు అరెస్ట్ చేస్తారు అంటూ […]

Undavalli Arun Kumar
- అక్టోబర్ 30 లోపు ఇంకో పెద్ద తలకాయను అరెస్ట్ చేస్తారట
- ఉండవల్లి జోస్యం.. ఏపీలో చర్చోపచర్చలు
విధాత: ఆంధ్ర పాలిటిక్స్ వేగంగా మారిపోతున్నాయి. చంద్రబాబు అరెస్ట్.. రెండువారాల జ్యుడిషియల్ రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు.. ఇక రాష్ట్రంలో టిడిపి శ్రేణుల ఆవేదన. అక్కడక్కడా ఆందోళనలు.. ఇవన్నీ ఇలా ఉండగా.. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి మరో బాంబ్ పేల్చారు. అక్టోబర్ 30 లోపు మరో పెద్ద తలకాయను పోలీసులు అరెస్ట్ చేస్తారు అంటూ అయన బ్రేకింగ్ న్యూస్ చెప్పారు.
చంద్రబాబు అరెస్ట్ అనేది పెద్ద విషయం కానట్లుగా భావిస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం అసలు సినిమా ముందుంది అన్నారు. ఆ అరెస్ట్ మామూలుది కాదని, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందని. మామూలు అరెస్ట్ కాదని అంటున్నారు. అది జాతీయ స్థాయిలో ప్రభావం చూపే అరెస్ట్ అని అయన అంటున్నారు కానీ ఇంతకూ ఆ వ్యక్తి ఎవరన్నది అయన చెప్పడం లేదు.
ఇదిలా ఉండగా ఉండవల్లి చెబుతున్న దాని ప్రకారం అయితే గత పదిహేనేళ్ళులా అయన మార్గదర్శి చిట్ ఫండ్ వ్యాపారంలో అక్రమాలు ఉన్నాయ్ అంతో కోర్టుల్లో పోరాడుతున్నారు. గతంలో ఉమ్మడి ఏపీ హై కోర్టు ఆ కేసును 2018 డిసెంబర్ లో కొట్టేస్తే దాని మీద సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ ఆయన పోరాడుతున్నారు. ఈ కేసులో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సైతం ఇంప్లీడ్ అయింది.
ఏపీ సీఐడీ సైతం మార్గదర్శి వ్యాపారంలో విస్తృతంగా దాడులు చేస్తూ వేలకోట్ల డబ్బు దారిమళ్లుతోందని చెబుతోంది. దీనిమీద ఇప్పటికీ మార్గదర్శి రామోజీరావును, ఎండీ శైలజను విచారించింది. ఈ నేపథ్యంలో ఉండవల్లి చెబుతున్న అరెస్టులు మార్గదర్శి పెద్దలకు చెందినవా అనే సందేహాలు వస్తున్నాయి.
దీంతోబాటు స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కుంభకోణంలో లోకేష్ ప్రమేయం ఉందని అంటున్నారు. ఒకవేళ ఉండవల్లి చెబుతున్న అరెస్ట్ లోకేష్ గురించా అనే సందేహాలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఏపీ రాజకీయాల్లో మున్ముందు ప్రకంపనలు ఉంటాయి అన్నది స్పష్టంగా తెలుస్తోంది. దీనిమీద ఆంధ్రాలో ఎక్కడ చూసినా చర్చలు నడుస్తున్నాయి.
