విధాత: జగన్ పార్టీకి.. ప్రభుత్వానికి ఊహించని దెబ్బ తగిలింది.. కుప్పంలో చెంద్రబాబును కొడతాం అనుకున్న వేళ ఇటు పులివెందుల కొట్టుకుపోవడంతో వైసిపి శ్రేణులు నిరుత్తరులయ్యాయి. చంద్రబాబు సొంత అడ్డా అయిన కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేయాలన్న ఆలోచనను తప్పు పట్టలేం. కానీ ఆ శ్రద్ధ సొంత నియోజకవర్గం పై పెట్టకపోవడంతోనే చిక్కు వచ్చింది.
కుప్పంలో వైసీపీ జెండా ఎగరాలన్న ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికారం మొత్తాన్ని విపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ఎన్నికల కోసం వాడేశారు. ఎంపీటీసీలు.. సర్పంచులు మొత్తం వైసీపీ ఖాతాలోకి వచ్చిపడ్డాయి. ఈ తరుణంలో వై నాట్ 175 అంటూ మొత్తం 175 స్థానాలు గెలిచే లక్ష్యంతో వైసీపీ కార్యక్రమాలు రూపొందించింది
అదే సమయంలో జగన్ పులివెందులమీద ఫోకస్ తగ్గించారని అంటున్నారు. దీంతో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పులివెందుల కూడా భాగమైన రాయలసీమ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వెన్నపూస రవీందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
అక్కడి నుంచి టిడిపి తరఫున పోటీ చేసిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించి జగన్‌కు ఓటమి రుచి చూపించారు. ఈ రామ్ గోపాల్ రెడ్డి .. 1969 మార్చి 23న వీరారెడ్డి.. లక్ష్మీదేవమ్మలకు
జన్మించారు. ఆయన పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలానికి చెందిన వారు.
బీఎస్సీ, బీఈడీ, ఎల్ఎల్ బీ పూర్తి చేసిన ఆయన 1990-94 మధ్యలో ఉదయం దినపత్రికలో పాత్రికేయుడిగా పనిచేశారు. 1996లో టీడీపీలో చేరారు. పార్టీ జిల్లా కార్యదర్శిగా.. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా.. తెలుగు యువత రాష్టర ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. మొత్తానికి పులివెందుల నుంచి పోటీ చేసి టీడీపీ నుంచి గెలిచి జగన్‌కు గట్టి సవాల్ విసిరారు.