విధాత: ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలికి జరుగుతున్న ఎన్నికల్లో రూలింగ్ వైఎస్సార్సీపీకి ఊహించని ఫలితాలు వచ్చాయి.. జగన్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో ఆంతా తిరగా మారగా అయిపోయింది. ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్న సీట్లు కోల్పోగా… పోతాయిలే అనుకున్న సీట్లు వైసీపీ ఖాతాలో చేరాయి. దీంతో పార్టీ పరిస్థితి నవ్వుతూ ఏడ్చినట్లు.. ఏడుస్తూ నవ్వుతున్నట్లు తయారైంది.
ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఎలాగైనా గెలుస్తాం అని భీషణ ప్రతిజ్ఞ చేసిన వైసిపి అక్కడ బోర్లా పడింది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ను వైసిపి అభ్యర్థిగా నిలబెట్టగా ఆయన టిడిపి అభ్యర్థి చిరంజీవి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఈ సీట్ ఖచ్చితంగా గెలుస్తాం అని వైసీపీ భావించిన అది జరగలేదు.
పుంగనూరు నియోజకవర్గంలో విజయ హేల…..
పుంగనూరు పుడ్డంగి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో టీడీపీ గెలుపు…..#MLCElectionCounting #TDPforDevelopment #TDPWillBeBack #TDPMlc pic.twitter.com/XfTUNsO5uT
— 𝙼𝙰𝙽𝙰_𝙰𝙽𝙳𝙷𝚁𝙰𝙿𝚁𝙰𝙳𝙴𝚂𝙷 (@MANA_ANDHRAPRAD) March 17, 2023
పట్టభద్రులు, చదువుకున్నవాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటెత్తారన్నది కొంతవరకు నిజమే కానీ సీతాం రాజు సుధాకర్ ను వైసిపి నాయకులూ ఎవరూ బాధ్యతగా తీసుకుని ఓట్లు వేయించలేదన్నది ఇంకో కారణం అయింది. దీంతో ఆయన అనివార్యంగా ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది.
ఇక టీచర్స్ నియోజకవర్గానికి వస్తే తూర్పు రాయలసీమ అభ్యర్థి పర్వత రెడ్డి చంద్రశేఖర రెడ్డి, పశ్చిమ రాయలసీమ అభ్యర్థి ఎంవి రామచంద్ర రెడ్డి లు వైఎస్సార్సీపీ తరఫున గెలుపొందారు. వాస్తవానికి టీచర్స్ తమకు వ్యతిరేకంగా ఉంటారని, వాళ్ళ డిమాండ్స్, అంటే వేతనాల పెంపు, ప్రమోషన్స్, కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం, ముఖ హాజరు, ఎన్నికల విధుల నుంచి తొలగింపు , పదోన్నతుల పెండింగ్, పాఠశాలల రేషనలైజేషన్ వంటి అంశాలు టీచర్లను బాగా ఇబ్బంది పెట్టాయి..
ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారని వైఎస్సార్సీపీ భావించింది. ఈ సీట్లలో గెలవడం కష్టం అని లెక్కేసుకుంది. కానీ అనూహ్యంగా టీచర్ల నియోజకవర్గంలో వైసిపి జెండా ఎగరేసి ఉపాధ్యాయులు తమ కుటుంబంలోని వాళ్ళే అని గట్టిగా చెప్పుకునేందుకు అవకాశం కలిగింది. కానీ ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్న గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల్లో ఉత్తరాంధ్రను కోల్పోవడం జగన్ను కాస్త ఇబ్బంది పెట్టింది.