Polavaram Funds | Modi | Jagan విధాత‌: అవిగో కేసులు..ఇవిగో అరెస్టులు.. ఇంకెక్కడా జగన్… రేపో .. ఎల్లుండో ప్రభుత్వం కూలిపోతుంది అంట్టూ టిడిపి వాళ్ళు కలలుగంటూ ఉండగానే నాలుగేళ్ళ పాలనా పూర్తి చేసిన జగన్ మోడీ దగ్గర మంచి మార్కులే కొట్టేసారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రకు ఇవ్వాల్సిన రెవెన్యూ లోటు కు సంబంధించిన డబ్బు దాదాపు పది వేలకోట్లు ఈమధ్యనే జగన్ ప్రభుత్వానికి కేంద్రం బదిలీ చేసింది. ఆ డబ్బును రకరకాల అవసరాలకు, […]

Polavaram Funds | Modi | Jagan

విధాత‌: అవిగో కేసులు..ఇవిగో అరెస్టులు.. ఇంకెక్కడా జగన్… రేపో .. ఎల్లుండో ప్రభుత్వం కూలిపోతుంది అంట్టూ టిడిపి వాళ్ళు కలలుగంటూ ఉండగానే నాలుగేళ్ళ పాలనా పూర్తి చేసిన జగన్ మోడీ దగ్గర మంచి మార్కులే కొట్టేసారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రకు ఇవ్వాల్సిన రెవెన్యూ లోటు కు సంబంధించిన డబ్బు దాదాపు పది వేలకోట్లు ఈమధ్యనే జగన్ ప్రభుత్వానికి కేంద్రం బదిలీ చేసింది. ఆ డబ్బును రకరకాల అవసరాలకు, పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం వినియోగించింది.

మున్సిపాలిటీల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం వెయిట్ చేస్తుండగా వాటిని ఇప్పుడు కేంద్రం ఇచ్చిన డబ్బుతో జగన్ ప్రభుత్వం క్లియర్ చేసింది. దానిమీద టిడిపి, దాని సపోర్టింగ్ మీడియా గోల పెడుతూనే ఉన్నాయ్. ప్రతిసోమవారం ఇకపై పొలవారం అని చెబుతూ హడావుడి చేసిన చంద్రబాబు అప్పట్లో నిధులు సైతం పొందలేదు. దానికితోడు కేంద్రం కడతాం అన్న ప్రాజెక్టును తామే కడతాం అని తీసుకుని దాన్ని అటూ ఇటూ కాకుండా చేసి మధ్యలో వదిలేసారు. ఇప్పుడు దానికి సంబంధించిన నిధులు తెచ్చుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు.

టిడిపి ఐదేళ్లు అధికారంలో ఉన్నపుడు ఇవ్వని డబ్బు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు. మోడీకి జగన్ అంటే ఇంత మోజు ఎందుకు అంటూ చర్చలు కూడా పెట్టాయి చానళ్ళు. ఇదిలా ఉండగానే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 13 వేలకోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది … త్వరలోనే ఆ డబ్బు కూడా వస్తుంది. ఇక పోలవరం పనులు సైతం జోరుగా నడిపిస్తారు. ఈ విషయంలోకూడా టిడిపి , చానెళ్లు కాస్త నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది.

ఏపీ ప్రాజెక్టులకు డబ్బురావడం విషయంలో ఒక రాష్ట్ర పౌరునిగా సంతోషించాల్సి ఉన్నా .. తమ హయాంలో రాలేదని, తాము ఆ డబ్బు ఖర్చు పెట్టె అవకాశం లేకపోయిందని బాధపడే పరిస్థితులే ఎక్కువ ఉన్నాయ్. పోలవరానికి చంద్రబాబు హయాంలో ఇచ్చిన అనుమతులు, ఎస్టిమేషన్లు మొత్తం మార్చేసి మరింత ఎక్కువ నిధులు పొందేలా జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

దీంతోబాటు మరో పదివేల కోట్లు సైతం అదనంగా ఇవ్వాలని జగన్ కోరగా దానికి సైతం మోడీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది అంటే ఇక పోలవరానికి నిధుల వరద మొదలైనట్లే. దాదాపు ప్రధాన పనులు పూర్తిచేసుకుని అక్కడక్కడా కొంత పనులు పెండింగ్ లో ఉన్న పోలవరానికి సంబంధించి ఇక నిధుల కొరత లేనట్లే. దాన్ని ఇక పరుగులు పెట్టించేందుకు జగన్ కు నిధుల సాయం ఢిల్లీ నుంచి అందడంలో అధికారులు సైతం పనులు ముమ్మరం చేస్తున్నారు. కాసేపటి క్రితం జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Updated On 6 Jun 2023 12:12 PM GMT
Somu

Somu

Next Story