Diesel Vehicles | ప్రస్తుతం కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా కాలుష్య రహిత వాహనాలను ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా ఈవీ వాహనాలను గతంలో రాయితీలను సైతం ప్రకటించింది. అదే సమయంలో డీజిల్ ఇంజిన్ వాహనాలకు చెక్ పెట్టేందుకు చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ఎస్ఐఏఎం 63వ వార్షిక సమావేశంలో నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాలుష్య పూరిత వాహనాల అమ్మకాలను నిరోధించే లక్ష్యంతో డిజిల్ […]

Diesel Vehicles |
ప్రస్తుతం కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా కాలుష్య రహిత వాహనాలను ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా ఈవీ వాహనాలను గతంలో రాయితీలను సైతం ప్రకటించింది. అదే సమయంలో డీజిల్ ఇంజిన్ వాహనాలకు చెక్ పెట్టేందుకు చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు.
ఎస్ఐఏఎం 63వ వార్షిక సమావేశంలో నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాలుష్య పూరిత వాహనాల అమ్మకాలను నిరోధించే లక్ష్యంతో డిజిల్ ఇంజిన్ వాహనాలపై పదిశాతం అదనంగా విధించాలని త్వరలో కేంద్ర ఆర్థిక మంత్రికి ప్రతిపాదించనున్నట్లు కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి ప్రకటించారు. కాలుష్య పన్ను పేరుతో ఆ పన్నును వసూలు సూచించనున్నట్లు వెల్లడించారు.
అయితే, ఈ నిర్ణయంత డీజిల్ వాహనాల ధరలు పెరిగి, వాటిని కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గుతుందని, అదే సమయంలో తయారీ సంస్థలను సైతం ఆయా వాహనాల ఉత్పత్తిని తగ్గిస్తాయన్నారు. డీజిల్ వాహనాలతో కాలుష్యం పెరగడమే కాకుండా.. ఇంధన దిగుమతి వ్యయం భారీగా పెరుగుతోందన్నారు.
‘డీజిల్‌కు గుడ్ బై చెప్పండి. ఉత్పత్తి చేయడం నిలిపివేయండి. అలా చేయకుంటే మేమే వాటిపై పన్నును పెంచుతాం’ అంటూ కేంద్రమంత్రి హెచ్చరించారు. కాలుష్య రహిత వాహనాలను ప్రోత్సహించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, వాటికి ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు.
అయితే, ప్యాసింజర్ వాహనాల కన్నా లారీలు, కంటైనర్ వంటి భారీ వాహనాలు, జనరేటర్స్ వంటివి ఎక్కువ డీజిల్‌ను కలుస్తాయి. మరి వాటిపై సైతం జీఎస్టీ విధిస్తారా? అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు, కేంద్రమంత్రి ప్రకటనతో మంగళవారం స్టాక్ మార్కెట్లలో ఆటో స్టాక్స్ కుప్పకూలాయి.
భారీ వాహనాలు, కమర్షియల్ వాహనాలు, ఎస్యూవీలు, ఎంపీవీలు ఎక్కువగా డీజిల్ వాహనాలుగానే ఉంటాయి. మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపడంతో మళ్లీ కేంద్రమంత్రి ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. ఇప్పటికిప్పుడే డీజిల్ ఇంజిన్ వాహనాలపై పన్ను పెంపు ఆలోచన, ప్రతిపాదన ఏదీ లేదని పేర్కొన్నారు.
