Rains విధాత: భూమినే నమ్ముకున్న అన్నదాతకు పుట్టెడు కష్టం వచ్చింది. ఆకాల వర్షాల (Rains)కు రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. ఆగని అకాల వర్షంతో అన్నదాత వెతలు తీరడం లేదు. ఏ జిల్లాలో చూసినా ఇదే పరిస్థితి. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం తీవ్రంగా ఉన్నది. చేతికి వచ్చిన వరి, మక్కజొన్నఅకాల వర్షాలతో తీరని నష్టాన్ని మిగిల్చింది. గడిచిన పదిహేను రోజుల్లో మూడుసార్లు ముంచెత్తిన వానల దెబ్బకు మక్కజొన్న, వరి నేలవాలి అన్నదాతల ఆశలను ఆవిరి చేసింది. […]

Rains

విధాత: భూమినే నమ్ముకున్న అన్నదాతకు పుట్టెడు కష్టం వచ్చింది. ఆకాల వర్షాల (Rains)కు రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. ఆగని అకాల వర్షంతో అన్నదాత వెతలు తీరడం లేదు. ఏ జిల్లాలో చూసినా ఇదే పరిస్థితి. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం తీవ్రంగా ఉన్నది. చేతికి వచ్చిన వరి, మక్కజొన్నఅకాల వర్షాలతో తీరని నష్టాన్ని మిగిల్చింది.

గడిచిన పదిహేను రోజుల్లో మూడుసార్లు ముంచెత్తిన వానల దెబ్బకు మక్కజొన్న, వరి నేలవాలి అన్నదాతల ఆశలను ఆవిరి చేసింది. చేతికి వచ్చిన కొద్దిపాట పంటను కూడా అమ్ముకోవడం రైతులకు పెద్ద సవాల్‌గా మారింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం, మళ్లీ వర్షం పడటంతో నిబంధనలకు అనుగుణంగా తేమశాతం రావడం గగనంగా మారింది.

తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ రైతులకు పడి గాపులు తప్పడం లేదు. తేమ శాతం అధికంగా ఉన్నదని తిరిగి ఎండబెట్టాలని కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు చెబుతున్నారని, ఎండబెట్టినా.. తిరిగి వానలు పడటంతో పరిస్థితి మొదటికి వస్తున్నదంటున్నారు.

ఇప్పటికే అప్పులపాలైన తమకు పంట నష్టం మరింత ఆర్థిక భారాన్ని మిగిల్చిందని రైతులు వాపోతున్నారు. పదిహేను రోజులైనా ధాన్యం కాంటా కావడంలేదని, ఎందుకని ప్రశ్నిస్తే మిల్లర్లు కొనడం లేదని చెబుతున్నారని రైతులు అంటున్నారు.

ఈదురుగాలులతో అకాల వర్షాలతో మరో పదిహేను రోజుల్లో చేతికి వచ్చే మక్కజొన్న నేల వారింది. నీరు చేరి కంకులు మారి మొలకెత్తుతున్నాయి. కింద పడిన కంకులను తీయడం రైతులకు కష్టమౌతున్నది. ఎకరానికి రూ. 30 వేలకు వరకు పెట్టుబడి పెట్టామని, దెబ్బతిన్న పంటను తీయాలంటే రూ. 12 వేల నుంచి 15 వరకు ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు.

పంట కోయాలంటే ఒక్కో కర్రను పైకి లేపి కోయాలని. మిషన్లు వచ్చే పరిస్థితి లేదని, కూలీలు కావాలి. ఇప్పటికే నష్టపోయిన తమకు కూలీలను పెట్టి పంట తీసుకోవాలంటే తలకు మించిన భారమవుతున్నదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. అధికారులు పంట నష్టాన్ని సరిగ్గా అంచచా వేయడం లేదంటున్నారు. క్షేత్రస్థాయిలో వచ్చి పంట నష్టాన్ని అంచనావేసి ప్రభుత్వమే తమకు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Cyclone Mocha | తెలుగు రాష్ట్రాల‌కు పొంచి ఉన్న 'మోచా' తుఫాను ముప్పు.. !

Updated On 3 May 2023 2:00 PM GMT
Somu

Somu

Next Story