UP సోషల్ మీడియాలో వీడియో వైరల్ అధికారిని తొలగించిన ప్రభుత్వం విధాత: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. తమ గ్రామానికి శ్మశాన వాటిక మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన యువకుడిపై ఓ అధికారి దారుణంగా ప్రవర్తించాడు. కోడి తరహాలో కూర్చోవాలని ఆదేశించాడు. ఈ దారుణ శిక్షకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సదరు అధికారిని ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన బరేలి జిల్లాలో తాజాగా చోటుచేసుకున్నది. […]

UP
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- అధికారిని తొలగించిన ప్రభుత్వం
విధాత: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. తమ గ్రామానికి శ్మశాన వాటిక మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన యువకుడిపై ఓ అధికారి దారుణంగా ప్రవర్తించాడు. కోడి తరహాలో కూర్చోవాలని ఆదేశించాడు. ఈ దారుణ శిక్షకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సదరు అధికారిని ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన బరేలి జిల్లాలో తాజాగా చోటుచేసుకున్నది.
మండన్‌పూర్ గ్రామంలో శ్మశాన వాటిక లేదని, మంజూరు చేయాలని జిల్లాలోని మీర్‌గంజ్ పట్టణంలో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) ఉదిత్ పవార్‌ను గ్రామానికి చెందిన పప్పు అనే యువకుడు వినతి ప్రతం సమర్పించారు. గతంలో రెండు సార్లు అధికారిని కలిసి వినతిపత్రం అందజేసినా ఫలితం లేకపోవడంతో ఇటీవల మరోసారి ఎస్‌డీఎంను కలిశారు. ఇన్నిసార్లు ఎందుకొస్తున్నామని కార్యాలయంలోకి అడుగుపెడుతూనే అధికారి మండిపడ్డారు.
తమకు న్యాయం జరగనందున మూడోసారి మీ దగ్గరకు వచ్చానని, న్యాయం జరిగే వరకు వస్తూనే ఉంటానని చెప్పడంతో ఎస్‌డీఎం ఉదిత్ పవార్ ఆగ్రహం ఊగిపోయారు. కోడిలా కూర్చోవాలని హుకూం జారీచేశాడు. ఎందుకు ఇలాంటి శిక్ష అని ప్రశ్నించినందుకు తనను తిట్టాడని బాధితుడు ఆరోపించారు.
అధికారి చాంబర్‌లో బాధితుడు కోడిలా వంగిన ఫొటోను తీసి కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్‌గా మారింది. అధికారి తీరుపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో అతడిని ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. అయితే, తనపై వచ్చిన ఆరోఫనలు ఎస్‌డీఎం ఖండించారు.
