కొద్ది నెలలక్రితం భార్య ఆత్మహత్య అనాథలైన ఇద్దరు కూతుర్లు విధాత, వరంగల్: చేసిన పనులకు రావాల్సిన బిల్లులు సకాలంలో రాక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకపోయి పురుగుల మందుతాగి ఉప సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లి గ్రామంలో జరిగింది. రాజకీయాల్లో భాగస్వామ్యమై ఊరికి ఎంతో కొంత చేద్దామనుకున్న యువకుడు అర్ధాంతరంగా ప్రాణాలు బలిపెట్టాడు. ఇటీవల అప్పులబాధతో త‌ల్లి సరిత, ఇప్పుడు తండ్రి కూడా మృతిచెందడంతో ఆయనపై ఆధారపడిన ఇద్దరు […]

  • కొద్ది నెలలక్రితం భార్య ఆత్మహత్య
  • అనాథలైన ఇద్దరు కూతుర్లు

విధాత, వరంగల్: చేసిన పనులకు రావాల్సిన బిల్లులు సకాలంలో రాక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకపోయి పురుగుల మందుతాగి ఉప సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లి గ్రామంలో జరిగింది.

రాజకీయాల్లో భాగస్వామ్యమై ఊరికి ఎంతో కొంత చేద్దామనుకున్న యువకుడు అర్ధాంతరంగా ప్రాణాలు బలిపెట్టాడు. ఇటీవల అప్పులబాధతో త‌ల్లి సరిత, ఇప్పుడు తండ్రి కూడా మృతిచెందడంతో ఆయనపై ఆధారపడిన ఇద్దరు కుమార్తెలు అనాధలయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

చిదినేపల్లి ఉప సర్పంచి బాలినేని తిరుపతి (35) గ్రామంలో గెలుపొందిన అనంతరం పలు అభివృద్ధి పనులను చేశాడు. దాదాపు రూ.11 లక్షలతో రైతు వేదిక నిర్మాణం, వీధి లైట్లు ఏర్పాటు చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగాడు.

గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం వరంగల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో తిరుపతి చనిపోయారు. అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని చిదినేపల్లి సర్పంచ్ అంతర్గం రాజమౌళి తెలిపారు.

ఎనిమిది నెలల క్రితం అప్పుల బాధతో తిరుపతి భార్య సరిత సైతం ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో తిరుపతి ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మిగిలారు. చిదినేపల్లి ఉప సర్పంచి బాలినేని తిరుపతి ఇద్దరు పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Updated On 1 Jan 2023 7:26 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story