- 4 గంటలకు పోలింగ్ ముగింపు
- 4 గంటలలోపు క్యూలైన్‌లో ఉన్న వారందరికీ అవకాశం
- పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్స్‌లన్నీ సరూర్ నగర్ స్ట్రాంగ్ రూమ్‌కు
- వెల్లడించిన సీఈఓ వికాస్ రాజ్
విధాత: మహాబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక(Upadhyaya MLC election)కు సజావుగా పోలింగ్(Poling) జరుగుతుందని సీఈఓ వికాస్ రాజ్(CEO Vikas Raj) తెలిపారు. ఉదయం 10 గంటల వరకు 19.54 శాతం పోలింగ్ నమోదు అయిందని తెలిపారు. పోలింగ్ ప్రారంభ సమయంలో ఉదయం పోలింగ్ ఏజెంట్స్ ల విషయంలో కొంత సమస్య వచ్చి సద్దుమనిగిందని, ఆతరువాత ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికకు 137 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటన్నింటిలో వెబ్ క్యాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేసి, పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగలేదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ పక్రియ ముగుస్తుందని, ఆసమయంలో క్యూ లైన్ లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద హెల్త్ టీమ్ లను ఏర్పాటు చేశామన్నారు.
వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్‌లను సరూర్ నగర్‌లోని స్ట్రాంగ్ రూమ్‌లకు తరిలిస్తామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మూడంచెల భద్రతతోపాటు సిసి కెమెరాల నిఘా ఉంటుందన్నారు.
మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పొలింగ్ పర్సంటేజ్ ఉదయం 11 గంటలకు 19.54 శాతం గా ఉంది.
ఏ జిల్లాలో ఎంత పర్సంటేజ్ అంటే…
మహబూబ్ నగర్ జిల్లా 19.30 %
నాగర్ కర్నూల్ జిల్లా 19.%
వనపర్తి జిల్లా 25.75%
గద్వాల్ జిల్లా 21.78 %
నారాయణపేట్ జిల్లా 20.35%
రంగారెడ్డి జిల్లా 15.40%
వికారాబాద్ జిల్లా 16.40%
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 17.60%
హైదరాబాద్ జిల్లా 21.00 %