విధాత‌: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. చిరు కోడలిగా ఈమె తనదైన శైలిలో అన్ని వ్యవహారాలను చక్కబెడుతుంది. కాగా ఇటీవల ఉపాసన రామ్ చరణ్‌లకు ఒక గుడ్ న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. వారిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు. చిరు తాతయ్య కాబోతున్నారు. దీన్ని చిరు ఎంతో సంతోషంగా ట్వీట్ చేశారు. దాన్ని చూసిన వారందరూ ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోయి వారిని దీవిస్తూ శుభాకాంక్షలు కూడా […]

విధాత‌: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. చిరు కోడలిగా ఈమె తనదైన శైలిలో అన్ని వ్యవహారాలను చక్కబెడుతుంది. కాగా ఇటీవల ఉపాసన రామ్ చరణ్‌లకు ఒక గుడ్ న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే.

వారిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు. చిరు తాతయ్య కాబోతున్నారు. దీన్ని చిరు ఎంతో సంతోషంగా ట్వీట్ చేశారు. దాన్ని చూసిన వారందరూ ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోయి వారిని దీవిస్తూ శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఏ ముహూర్తాన చ‌ర‌ణ్ ఉపాస‌న‌లు త‌ల్లిదండ్రులు కాబోతున్న సంగ‌తి తెలిసిందో అప్ప‌టి నుంచి రామ్ చరణ్ జాతకమే మారిపోయింది.

అప్పటివరకు దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న ఆయన ఒక్కసారిగా ఆస్కార్‌కు RRR నామినేట్ కావడంతో పాటు ఈ చిత్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ముఖ్యంగా రామ్ చరణ్ నటనకు హాలీవుడ్ నటులు, మేకర్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా ఉపాసన రామ్ చరణ్‌తో కలిసి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. RRR టీంతో కలిసి దిగిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ సందర్భంగా ఆమె ‘RRR టీంలో భాగమైనందుకు నాకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. ఇది దేశం గర్వించదగ్గ విజయం. ఈ ప్రయాణంలో నేను పాలు పంచుకునేలా చేసిన రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళికి నా ధన్యవాదాలు. నాతో కలిసి నా బేబీ కూడా ఈ మధురానుభూతిని పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాలు భావోద్వేగాన్ని కలిగిస్తున్నాయి’.. అంటూ ట్వీట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన మెగా అభిమానులు ఆనందంతో మురిసిపోతూ ఉపాసనకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

Updated On 13 Jan 2023 4:26 PM GMT
krs

krs

Next Story