Bro Movie | పవన్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ నటిస్తున్న చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి. తమిళ ‘వినోదయ సితం’ సినిమా రీమే‌గా తెలుగులో బ్రోగా తీసుకువస్తున్నది. ఇప్పటికే షూటింగ్‌ తుది దశకు చేరింది. అయితే, సినిమా గురించి లేటెస్ట్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో బాలీవుడ్‌ బ్యూటీ ఊశ్వరి రౌతేలా నర్తించనున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై చిత్ర యూనిట్‌ అధికారికంగా […]

Bro Movie | పవన్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ నటిస్తున్న చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి. తమిళ ‘వినోదయ సితం’ సినిమా రీమే‌గా తెలుగులో బ్రోగా తీసుకువస్తున్నది. ఇప్పటికే షూటింగ్‌ తుది దశకు చేరింది. అయితే, సినిమా గురించి లేటెస్ట్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో బాలీవుడ్‌ బ్యూటీ ఊశ్వరి రౌతేలా నర్తించనున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై చిత్ర యూనిట్‌ అధికారికంగా వెల్లడించలేదు. స్పెషల్‌ సాంగ్‌కు ఊర్వశి రౌటేలా పేరును ఖరారు చేశారని, త్వరలోనే షూటింగ్‌కు హాజరయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతున్నది. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో ఊర్వశి మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులేసింది. ఈ పాట మంచి హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది.

అయితే, అక్కినేని అఖిల్‌ ‘ఏజెంట్‌’ సినిమా స్పెషల్‌ సాంగ్‌లో నర్తించింది. అలాగే రామ్‌ - బోయపాటి కాంబోలో వస్తున్న చిత్రంలోనూ ఊర్వశి స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనున్నది. బో సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ కోసం శ్రుతి హాసన్‌, దిశా పటానీ పేర్లు వినిపించినా చివరకు ఊర్వశి రౌటేలా వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. బ్రో సినిమాలో పవన్ కల్యాణ్ దేవుడి పోషించనుండగా.. సాయిధరమ్ తేజ్ బైక్ రేసర్ రోల్‌ను పోషించనున్నారు. సాయిధరమ్ తేజ్‍కు కేతిక శర్మ జోడీగా నటిస్తున్నది. జీ స్టూడియో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రియా ప్రకాశ్ వారియర్, సుబ్బరాజు, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోష్తిన్నారు. చిత్రాన్ని జూలై 28న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

Updated On 6 Jun 2023 1:51 AM GMT
cm

cm

Next Story