HomelatestUS Fed | మరోసారి వడ్డీరేట్లను పెంచిన అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌.. ఏప్రిల్‌లో ఆర్‌బీఐ పెంచే...

US Fed | మరోసారి వడ్డీరేట్లను పెంచిన అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌.. ఏప్రిల్‌లో ఆర్‌బీఐ పెంచే అవకాశం..!

US Fed | ప్రపంచవ్యాప్తంగా బ్యాంకుల దివాళా ప్రకటన నేపథ్యంలో అమెరికా సెంటల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ మరోసారి వడ్డీ రేట్లను పెంచింది. ఫెడ్ బుధవారం 0.25 శాతం వడ్డీ రేటు పెంపును ప్రకటించింది. దాంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఇప్పుడు 4.75 నుంచి 5 శాతానికి చేరుకున్నాయి. 2007 తర్వాత గరిష్ఠ స్థాయికి చేరింది. ఫెడ్‌ రిజర్వ్‌ నిర్ణయం స్టాక్‌ మార్కెట్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ఎస్‌అండ్‌పీ500 స్వల్ప లాభంతో ట్రేడయ్యింది. 2008లో లెమాన్‌ బ్రదర్స్‌ బ్యాంక్‌ నష్టం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది.

ఇటీవల అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌తో పాటు సిగ్నేచర్‌ బ్యాంకులు దివాళా తీశాయి. పలు బ్యాంకులో మరో బ్యాకులో విలీనమయ్యాయి. బ్యాంకు సంక్షోభం నేపథ్యంలో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను పెంచింది. ఇదిలా ఉండగా.. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయం నేపథ్యంలో ఆర్‌బీఐ (RBI) సైతం ఏప్రిల్‌ మొదటి వారంలో వడ్డీ రేట్లను 0.25శాతం పెంచే అవకాశం ఉంది. ఈ వారంలో యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ECB) వడ్డీరేట్లను అరశాతం పెంచింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు ఈ ఏడాది రేట్లను పెంచడం కొనసాగించే సంకేతాలు కనిపిస్తున్నాయి.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular