Jill Biden | విధాత: వచ్చే వారం దిల్లీలో జరగనున్న జీ-20 సదస్సుకు సంబంధించి ప్రతికూల అంశాలు పెరిగిపోతున్నాయి. ఈ సదస్సుకు హాజరుకాబోవడం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా అమెరికా అధ్యక్షుడి (America President) రాక పైనా అనుమానాలు మొదలయ్యాయి. బైడెన్ భార్య, అమెరికా మొదటి మహిళ జిల్ బైడెన్‌కు కొవిడ్ పరీక్షలో పాజిటివ్ (Covid Positive) వచ్చినట్లు శ్వేతసౌధం సోమవారం ప్రకటించింది. అయితే బైడెన్‌కు మాత్రం […]

Jill Biden |
విధాత: వచ్చే వారం దిల్లీలో జరగనున్న జీ-20 సదస్సుకు సంబంధించి ప్రతికూల అంశాలు పెరిగిపోతున్నాయి. ఈ సదస్సుకు హాజరుకాబోవడం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా అమెరికా అధ్యక్షుడి (America President) రాక పైనా అనుమానాలు మొదలయ్యాయి.
బైడెన్ భార్య, అమెరికా మొదటి మహిళ జిల్ బైడెన్‌కు కొవిడ్ పరీక్షలో పాజిటివ్ (Covid Positive) వచ్చినట్లు శ్వేతసౌధం సోమవారం ప్రకటించింది. అయితే బైడెన్‌కు మాత్రం పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని వెల్లడించింది. ముందుగా జిల్ బైడెన్‌కు కొవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించాం. ఆవిడకు పాజిటివ్ అని తేలింది.
అయితే.. జో బైడెన్‌కు ప్రస్తుతం నెగటివ్ అని వచ్చింది. ఈ వారంలో ఆయనకు లక్షణాలు కనిపిస్తాయామో పరిశీలిస్తాం అని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం తన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతానికి అధ్యక్షుడి భారత పర్యటనపై ఎలాంటి వివరణ ఇవ్వకపోయినప్పటికీ.. ఆయన పర్యటన వివరాలను యథావిధిగా అధికారులు విడుదల చేశారు. గురువారం భారత పర్యటనకు రానున్న ఆయన ఆదివారం వరకు భారత్‌లో ఉండి.. వియత్నాంకు పయనమవుతారు.
మరోవైపు జీ-20 సదస్సుకు భారత ప్రభుత్వం సర్వ సన్నద్ధంగా ముస్తాబవుతోంది. సదస్సు జరిగే నాలుగు రోజుల పాటు దిల్లీ పాఠశాలలకు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. మెట్రోలను పాక్షికంగా రద్దు చేయాలని, వాహన సంచారాన్నినియంత్రించాలని ఇప్పటికే ఆదేశాలున్నాయి. అధ్యక్షులు ఏఏ హోటళ్లలో ఆశ్రయం పొందాలనే కార్యాచరణను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
