US Open 2023 | సెర్బియా స్టార్‌ టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జోకొవిచ్‌ సరికొత్త చరిత్రను లిఖించాడు. యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో రష్యన్ ఆటగాడు మెద్వెదేవ్‌పై విజయం సాధించి.. అరుదైన రికార్డును సాధించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన రికార్డును సమం చేశాడు. జోకొవిచ్ కెరీర్‌లో ఇది 24వ గ్రాండ్‌స్లామ్‌. లెజెండరీ ప్లేయర్ సెరెనా విలియమ్స్‌ను రికార్డును అధిగమించి.. 24 టైటిల్స్‌తో ఉన్న మార్గరెట్ కోర్ట్‌ రికార్డును సమం చేశాడు. అయితే, ఆమె గెలిచిన 24 టైటిల్స్‌లో […]

US Open 2023 |

సెర్బియా స్టార్‌ టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జోకొవిచ్‌ సరికొత్త చరిత్రను లిఖించాడు. యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో రష్యన్ ఆటగాడు మెద్వెదేవ్‌పై విజయం సాధించి.. అరుదైన రికార్డును సాధించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన రికార్డును సమం చేశాడు. జోకొవిచ్ కెరీర్‌లో ఇది 24వ గ్రాండ్‌స్లామ్‌. లెజెండరీ ప్లేయర్ సెరెనా విలియమ్స్‌ను రికార్డును అధిగమించి.. 24 టైటిల్స్‌తో ఉన్న మార్గరెట్ కోర్ట్‌ రికార్డును సమం చేశాడు.

అయితే, ఆమె గెలిచిన 24 టైటిల్స్‌లో 13 ఓపెన్ ఎరా కంటే ముందువే ఉండగా.. ఇక జోకొవిచ్‌కు ఇది నాలుగో యూఎస్ ఓపెన్ టైటిల్. యూఎస్‌ ఓపెన్‌లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో మెద్వదేవ్‌పై జోకొవిచ్‌ 6-3, 7-6, 6-3తో వరుస సెట్లలో గెలుపొందాడు.

అయితే, రెండేళ్ల కిందట యూఎస్ ఓపెన్ గెలిచి 1969లో రాడ్ లేవర్ తర్వాత కేలండర్ గ్రాండ్‌స్లామ్ గెలిచిన ప్లేయర్‌గా నిలవాలనుకున్న జోకొవిచ్‌కు మెద్వెదేవ్‌ షాక్‌ ఇచ్చాడు. ఆ ఏడాది ఫైనల్లో జొకోవిచ్‌ను మెద్వెదేవ్‌ ఓడించి.. తన కెరీర్‌లో తొలి మేజర్‌ టైటిల్‌ను నెగ్గాడు.

ప్రస్తుతం రష్యన్‌ స్టార్‌ను ఓడించి సెర్బియా స్టార్‌ ప్రతీకారం తీర్చుకున్నాడు. గతేడాది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోని కారణంగా ఈ గ్రాండ్‌స్లామ్‌కు జోకొవిచ్‌ ఈ సారి చెలరేగిపోయాడు. రెండు నెలల కిందట వింబుల్డన్ ఫైనల్లో అల్కరాజ్ చేతుల్లో ఓటమితో తీవ్ర నిరాశకు గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు.

చివరకు యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను సాధించాడు. ఒక ఏడాదిలో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవడం జోకొవిచ్‌కు ఇది నాలుగోసారి. గతంలో 2011, 2015, 2021లలోనూ మూడేసి గ్రాండ్‌స్లామ్స్‌ను నెగ్గాడు. అయితే, కేలండర్ గ్రాండ్‌స్లామ్ కలగానే మిగిలిపోయింది.

Updated On 12 Sep 2023 1:44 AM GMT
cm

cm

Next Story