US Woman | అమెరికాకు చెందిన ఓ మహిళ విటమిన్ ట్యాబ్లెట్స్ అనుకొని.. భర్తకు చెందిన యాపిప్ ఎయిర్‌పోడ్ ప్రోను మింగేసింది. ఈ ఘటన మార్నింగ్ వాక్‌లో జరిగినట్లు సదరు మహిళ వెల్లడించారు. యూఎస్‌కు చెందిన టిక్‌టాకర్ రియల్టర్ తన్న బార్కర్(52) తన స్నేహితురాలితో కలిసి మార్నింగ్ వాక్‌కు వెళ్లింది. ఫ్రెండ్‌తో మాట్లాడుతూ.. పొరపాటున బార్కర్ విటమిన్ మెడిసిన్‌కు బదులుగా యాపిల్ ఎయిర్‌పోడ్ ప్రోను మింగేసి నీళ్లు తాగింది. ఈ సందర్భంగా బార్కర్ మాట్లాడుతూ.. మార్నింగ్ వాక్ […]

US Woman |
అమెరికాకు చెందిన ఓ మహిళ విటమిన్ ట్యాబ్లెట్స్ అనుకొని.. భర్తకు చెందిన యాపిప్ ఎయిర్‌పోడ్ ప్రోను మింగేసింది. ఈ ఘటన మార్నింగ్ వాక్‌లో జరిగినట్లు సదరు మహిళ వెల్లడించారు.
యూఎస్‌కు చెందిన టిక్‌టాకర్ రియల్టర్ తన్న బార్కర్(52) తన స్నేహితురాలితో కలిసి మార్నింగ్ వాక్‌కు వెళ్లింది. ఫ్రెండ్‌తో మాట్లాడుతూ.. పొరపాటున బార్కర్ విటమిన్ మెడిసిన్‌కు బదులుగా యాపిల్ ఎయిర్‌పోడ్ ప్రోను మింగేసి నీళ్లు తాగింది.
ఈ సందర్భంగా బార్కర్ మాట్లాడుతూ.. మార్నింగ్ వాక్ చేస్తుండగా, మధ్యలో విటమిన్స్ తీసుకోవాలను కున్నాను. ఈ క్రమంలో నా బ్యాగులోంచి విటమిన్స్ తీసుకొని వేసుకుని నీళ్లు కూడా తాగేశాను.
అప్పుడే ఎందుకో గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు అనిపించింది. అదే సమయంలో స్నేహితురాలు కాథ్లీన్‌కు బాయ్ చెబుతండగా తన చేతిలోనే విటమిన్ పిల్స్ కనిపించగా వాటిని చూసి ఆశ్చర్యపోయాను.
నేను విటమిన్స్‌కు బదులుగా తన భర్త లెఫ్ట్ ఎయిర్‌పోడ్ ప్రో మింగినట్లు గ్రహించిన బార్కర్ ఇంటికి వెళ్లి జరిగిన ఘటన గురించి తన భర్తకు తెలిపింది. దీంతో ఈ విషయాన్ని నాతో చెప్పావు కానీ ఇతరులతో చెప్పకని సూచించాడు. కానీ ఆమె తన టిక్ టాక్ ఫాలోవర్స్‌కు తెలిపింది.
