HomelatestUSA | షూటింగ్‌ ప్రాక్టీస్‌ వద్దన్నందుకు.. ఐదుగురిని కాల్చేశాడు

USA | షూటింగ్‌ ప్రాక్టీస్‌ వద్దన్నందుకు.. ఐదుగురిని కాల్చేశాడు

USA

  • అమెరికాలో ఆగని తుపాకీ మోతలు
  • అత్యధిక గన్‌లైసెన్స్‌లు ఉన్నది అమెరికాలోనే

విధాత: ప్రపంచంలోనే అత్యధిక మందికి గన్‌ లైసెన్స్‌లు ఉన్న దేశంగా ఘనత వహించిన అమెరికాలో నిత్యం కాల్పల మోత వినిపిస్తూనే ఉంటుంది. తాను గన్‌ షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేయడంపై అభ్యంతరం తెలిపిన తన పొరుగువారిని ఒకడు తుపాకితో కాల్చి చంపాడు.

టెక్సాస్‌లోని క్లేవ్‌లాండ్‌లో ఫ్రాన్సిస్కో ఒరొపెసా అనే 38 ఏళ్ల వ్యక్తి.. ఏఆర్‌ 15 స్టైల్‌ సెమీ ఆటోమేటిక్‌ మెషీన్‌ గన్‌ ఒకటి కొన్నాడు. దానితో జనావాసాల మధ్యే తన యార్డులో షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. దీంతో ఇరుగు పొరుగు వారు అభ్యంతరం చెప్పారు.

తుపాకీ శబ్దాలకు తమ చంటిపాప ఉలిక్కిపడి నిద్రలేస్తున్నదని, షూటింగ్‌ ప్రాక్టీస్‌ ఆపాలని కోరారు. దీనికి ఆగ్రహోదగ్రుడైన ఫ్రాన్సిస్కో తుపాకీ లోడ్‌ చేసుకుని, తన షూటింగ్‌కు అభ్యంతరం చెప్పిన వారి ఇండ్లపై పడి విచక్షణారహితంగా కాల్పలు జరిపాడు.

ఈ కాల్పుల్లో ఎనిమిదేళ్ల బాలుడు సహా ఐదుగురు చనిపోయారు. కాల్పులు జరిపిన అనంతరం ఆ దుండగుడు పరారయ్యాడు. దాదాపు మృతులందరికీ తలపైనే తూటా గాయాలు అయ్యాయి. అతని కోసం 200 మందితో కూడిన పోలీసుల బృందం టెక్సాస్‌ను జల్లెడ పడుతున్నదని అధికారులు తెలిపారు. అతడి ఆచూకీ చెప్పిన వారికి 80 వేల డాలర్లు రివార్డు ఇస్తామని ప్రకటించారు.

USAలో సర్వసాధారణమైపోయిన కాల్పలు

అమెరికాలో తుపాకీ సంస్కృతి వెర్రితలలు వేస్తున్నది. ప్రపంచంలోనే అత్యధిక వ్యక్తిగత గన్‌ లైసెన్సలు ఉన్నది అమెరికాలోనే. ఈ ఏడాది ఇప్పటి వరకు 176 ఘటనలు చోటు చేసుకున్నాయి. 2016 తర్వాత ఇదే గరిష్ఠమని గన్‌ వైలెన్స్‌ ఆర్కైవ్స్‌ పేర్కొంటున్నది. మాస్‌ షూటింగ్‌లో నలుగురు ఆపైన గాయపడటమో, చనిపోవడమో జరుగుతున్నదని తెలిపింది.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular