అందులో తెలుగు అమ్మాయిలదే అగ్రస్థానం
విధాత: 2023 జనవరిలో అండర్-19 వుమెన్స్ ప్రపంచ కప్ పోటీ 2023 జనవరి దక్షిణాఫ్రికాలో జరుగబోతున్న నేపథ్యంలో.., మొదటిసారి అమెరికా నుంచి వుమెన్స్ అండర్-19 జట్టు అర్హత సాధించింది.
మహిళల అండర్ 19 ప్రపంచ కప్ పోటీకి ప్రకటించిన 15మంది టీములో ఐదుగురు తెలుగు మూలాలున్న వారే కావటం ముదావహం. రిజర్వ్ ఆటగాళ్లుగా ప్రకటించిన ఇద్దరిలోనూ ఒకరు తెలుగమ్మాయి ఉన్నది. అంతే కాదు, ఈ టీముకు కెప్టెన్, వైస్ కెప్టెన్ కూడా తెలుగు అమ్మాయిలే కావటం గర్వకారణం.
అమెరికా మహిళల క్రికెట్ టీముకు ఎంపికైన వారిలో… కెప్టెన్ కొడాలి గీతిక, వైస్ కెప్టెన్ కొలను అనికారెడ్డితో పాటు.. భద్రిరాజు భూమిక, ముళ్లపూడి లాస్య, ఇయ్యుని సాయితరుణి, రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైన వేదాంతం కస్తూరి ఉన్నారు.
వీరంతా సాఫ్ట్ వేర్ వృత్తి నిపుణులుగా , ఇంకా ఇతర వృత్తి, వ్యాపారాలతో అమెరికాలో స్థిరపడిన కుటుంబాల నుంచి ఎదిగి వచ్చారు. తెలుగు-అమెరికన్ మూలాలతో అమెరికాలోనే పుట్టిపెరిగి భిన్న సంస్కృతుల సమ్మేళనానికి నిజమైన ప్రతినిధులుగా నిలుస్తున్నారు.
తాము క్రికెట్ ఆడుతూ… క్రికెట్‌ను అ మితంగా ప్రేమించే భారత్‌తో మమేకం అవుతామని అంటున్నారు. ఇండియాలో క్రికెట్‌ను ఒక మతంగా భావిస్తారు… క్రికెట్‌ను అంతగా అభిమానిస్తారు, ప్రేమిస్తారు.
ప్రపంచ క్రీడ అయిన క్రికెట్‌ను తాము అమెరికా తరపున ఆడటానికి తెలుగు వారిగా గర్వంగా భావిస్తున్నామని అంటున్నారు తెలుగు అమ్మాయిలు. కొత్త సంవత్సరం వేళ… హాట్సాప్ టు అమెరికన్ తెలుగు గార్ల్స్..