Tuesday, January 31, 2023
More
  Homelatestవచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం: కేంద్రమంత్రి మహేంద్ర నాథ్ పాండే

  వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం: కేంద్రమంత్రి మహేంద్ర నాథ్ పాండే

  • కేసీఆర్ నియంత పాల‌నా విధానాలు ప్ర‌జ‌లకు వివ‌రించాలి..
  • బీజేపీని ఆద‌రించేందుకు సిద్ధంగా ఉన్న ప్ర‌జ‌లు..
  • పార్టీని ఇంటింటికీ తీసుకెళ్లాల‌ని పార్టీ శ్రేణులకు పిలుపు

  విధాత: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, పార్టీ శ్రేణులు ఇంటింటికి పార్టీని తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే సూచించారు. బుధవారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ పార్లమెంటరీ కోర్ కమిటీ, శక్తి కేంద్రాలు, డివిజన్ ఇన్‌చార్జీల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

  అనంతరం నల్లగొండ జిల్లా కేంద్రంలో పానగల్ లో నిర్మిస్తున్న నేషనల్ హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. త‌ద‌నంత‌రం నల్గొండ అసెంబ్లీ కోర్ కమిటీ, పరివార్ కమిటీ సమావేశాల్లో మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

  ఇటు రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ ప్రభుత్వ కుటుంబ, అవినీతి, నియంతృత్వ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజల్లోకి పార్టీని విస్తరించేలా స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

  ఎన్నికల్లో విజయ సాధనకు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ముందుకు సాగాలన్నారు. మోడీ సర్కార్ 6000 కిలోమీటర్ల జాతీయ రహదారులకు నిధులు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట, నల్గొండ జిల్లాల నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు, జిల్లా పార్టీ అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి, కర్ణాటి కిషన్, మన్మధ రెడ్డి, హబీబ్, సైదులు, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, నూకల నరసింహారెడ్డి, పోతపాక సాంబయ్య, మాదగోని శ్రీనివాస్ గౌడ్, బండారు ప్రసాద్, యాదగిరి చారి, పాలకూర రవి, రాజశేఖర్ రెడ్డి, దాయం భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular