విధాత: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వందే భారత్ రైలు నేడు ప్రారంభం కానుంది. ఉదయం 10:30 గంటలకు పట్టాలపై వందే భారత్ దూసుకెళ్లనుంది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి ఈ రైలును ప్రారంభించనున్నారు. అనంతరం ఈ రైలు సికింద్రాబాద్ – విశాఖపట్నం స్టేషన్ల మధ్య ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అయితే ఈ రైలు సోమవారం నుంచి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా మిగతా ఆరు రోజులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనుంది.
రైలు ప్రారంభం రోజున సికింద్రాబాద్ స్టేషన్లో ఉదయం 10:30 గంటలకు బయల్దేరి, విశాఖకు రాత్రి 8:45 గంటలకు చేరుకోనుంది. విశాఖ నుంచి ప్రతి రోజు ఉదయం 5:45 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 2:15 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి, రాత్రి 11:30 గంటలకు విశాఖకు చేరుకోనుంది. అంటే కేవలం 8 గంటల్లోనే ఈ రైలు విశాఖ – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – విశాఖ మధ్య ప్రయాణించనుంది. ఇక ఈ రెండు స్టేషన్ల మధ్య వందే భారత్ 21 స్టేషన్లలో ఆగనుంది.
చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపట్టిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో వందేభారత్ ఆగనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
ఏసీ చైర్ కార్ ఛార్జీ
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు – రూ. 1,720
విశాఖపట్నం నుంచి రాజమండ్రికి – రూ. 625
విశాఖపట్నం నుంచి విజయవాడ జంక్షన్ వరకు – రూ. 960
విశాఖపట్నం నుంచి ఖమ్మం వరకు – రూ. 1,115
విశాఖపట్నం నుంచి వరంగల్ – రూ. 1,310
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు – రూ. 1,665
సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి – రూ. 1,365
సికింద్రాబాద్ నుంచి విజయవాడ జంక్షన్ వరకు – రూ. 905
సికింద్రాబాద్ నుంచి ఖమ్మం వరకు – రూ. 750
సికింద్రాబాద్ నుంచి వరంగల్ – రూ. 520
ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు – రూ. 3,170
విశాఖపట్నం నుంచి రాజమండ్రికి – రూ. 1,215
విశాఖపట్నం నుంచి విజయవాడ జంక్షన్ వరకు – రూ. 1,825
విశాఖపట్నం నుంచి ఖమ్మం వరకు – రూ. 2,130
విశాఖపట్నం నుంచి వరంగల్ – రూ. 2,540
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు – రూ. 3,120
సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి – రూ. 2,485
సికింద్రాబాద్ నుంచి విజయవాడ జంక్షన్ వరకు – రూ. 1,775
సికింద్రాబాద్ నుంచి ఖమ్మం వరకు – రూ. 1,460
సికింద్రాబాద్ నుంచి వరంగల్ – రూ. 1,005