విధాత‌: ఒకప్పుడు తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్‌గా వెలిగిన దిల్‌రాజు ఆ స్థాయికి చేరుకోవడానికి కారణం ఆయన జడ్జిమెంట్. కొత్తదనం నిండిన కథలను, టాలెంట్ ఉన్న దర్శకులను ప్రోత్సహించడం ఒక కారణం. ఒక కారణం కాదు అదే ప్రధాన కారణం. కానీ రాను రాను ఆయన జడ్జిమెంట్ తప్పుతూ వస్తుంది. పాత చింతకాయ పచ్చడి వంటి చిత్రాలను తీస్తూ తన పరువు తానే పోగొట్టుకుంటున్నాడు. ఇటీవల కాలంలో ఆయనకు మంచి విజయాలను అందించిన చిత్రాలు ఏమి పెద్దగా కనిపించవు. […]

విధాత‌: ఒకప్పుడు తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్‌గా వెలిగిన దిల్‌రాజు ఆ స్థాయికి చేరుకోవడానికి కారణం ఆయన జడ్జిమెంట్. కొత్తదనం నిండిన కథలను, టాలెంట్ ఉన్న దర్శకులను ప్రోత్సహించడం ఒక కారణం. ఒక కారణం కాదు అదే ప్రధాన కారణం. కానీ రాను రాను ఆయన జడ్జిమెంట్ తప్పుతూ వస్తుంది. పాత చింతకాయ పచ్చడి వంటి చిత్రాలను తీస్తూ తన పరువు తానే పోగొట్టుకుంటున్నాడు. ఇటీవల కాలంలో ఆయనకు మంచి విజయాలను అందించిన చిత్రాలు ఏమి పెద్దగా కనిపించవు.

ఇక విషయానికొస్తే ప్రస్తుతం ఆయన కోలీవుడ్‌లో కూడా స్టార్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకోవాలని పరితపించిపోతున్నాడు. బాలీవుడ్‌కి వెళ్లి చేతులు కాల్చుకున్న ఈయన.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారిసు’ అనే తమిళ చిత్రాన్ని తీస్తున్నాడు. దీన్నే తెలుగులో ‘వారసుడు’గా డబ్బింగ్ చేస్తున్నాడు. ఈ మూవీని ఆయన ఏదేదో ఊహించుకుంటున్నాడు అనడానికి ఓ ఉదాహరణ చాలు.

అదేమిటంటే బాలయ్య నటించిన వీరసింహారెడ్డికి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యకు పోటీకి దింపడం. చిత్రం ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక మందన్నా, శ్రీకాంత్, జయసుధ, ప్రకాష్ రాజు వంటి తెలుగు వాళ్లకు పరిచయమైన న‌టీన‌టులు కనిపించడంతో ఇది ఒక తెలుగు సినిమా అనే ఫీల్ కలుగుతుంది. అంతేకాదు ఈ సినిమా నేపథ్యం కూడా ఎక్కడో చూసిన తెలుగు సినిమాలను పోలినట్లుగా అనిపిస్తుంది..

ఈ చిత్రం తాజా ట్రైల‌ర్ ని చూస్తుంటే ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అల వైకుంఠపురంలో వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. మరీ ముఖ్యంగా తమ్ముడు ఫేమ్ అరుణ్ కుమార్ దర్శకత్వంలో నవదీప్ హీరోగా నటించిన గౌతమ్ ఎస్‌ఎస్‌సిని తిరగ తిప్పి తీశారా అనే అనుమానం కలుగుతోంది. అదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

కుటుంబ పెద్ద తన పెద్ద కుమారులు ఇద్దరినీ ఇంట్లో పెట్టుకుని చిన్న కొడుకును దూరం పెడతాడు. కానీ ఆ కుటుంబానికి సమస్యలు వచ్చి పెద్ద కొడుకులు ఇద్దరూ బయటికి వెళ్లిపోతారు. వారిద్దరూ సమస్యలను వదిలేసి వెళ్లిపోయిన సమయంలో తాను వద్దనుకున్న చిన్న కొడుకే వచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తాడు. అచ్చం ఇదే స్టోరీ లైన్‌తో వారసుడు తెరకెక్కినట్టుగా కనిపిస్తోంది.

కథా పరంగానే కాదు మేకింగ్ పరంగాను ఈ సినిమాకు చాలా తెలుగు సినిమాలతో పోలికలు కనిపిస్తుండడంతో వారసుడు మీద ఆల్రెడీ ట్రోలింగ్ మొదలైపోయింది. అయితే ఈ కాన్సెప్ట్ తమిళ ప్రేక్షకులకు ఏమైనా రీచ్ అవుతుందా? అంటే అవుతుందని కొందరు అంటున్నారు.

ట్రైలర్ చాలా స్టైలిష్‌గా, బాగా కాస్ట్లీగా, చాలా మాస్‌గా కనిపిస్తోంది. విజయ్‌ అభిమానులు కోరుకునే ఫ్యాన్ మూమెంట్స్, డైలాగ్స్ బాగా దట్టించారు. దీనికి తోడు ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కూడా ఢోకా లేకుండా ఉంది. కాబట్టి ఈ చిత్రాన్ని తమిళ తంబీలు ఆదరిస్తారో లేదో తెలియకపోయినా.. తెలుగు ప్రేక్షకులు మాత్రం పెద్దగా ఆదరించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.

Updated On 8 Jan 2023 6:31 AM GMT
krs

krs

Next Story