Varun Tej | టాలీవుడ్ క్రేజీ క‌పుల్ వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి గ‌త ఐదారేళ్లుగా ప్రేమ‌లో ఉన్నా కూడా ఏ నాడు వారు ప్రేమ‌లో ఉన్న‌ట్టు చెప్ప‌లేదు. అంతేకాదు మీడియాకి కూడా దొర‌క్కుండా జాగ్ర‌త్త‌ ప‌డ్డారు. జూన్‌లో సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకొని అంద‌రికి పెద్ద షాకిచ్చారు. ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్న ఈ ప్రేమ జంట ఎప్పుడు పెళ్లి పీట‌లు ఎప్పుడు ఎక్కుతారా అని అంద‌రు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం వీరి […]

Varun Tej |

టాలీవుడ్ క్రేజీ క‌పుల్ వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి గ‌త ఐదారేళ్లుగా ప్రేమ‌లో ఉన్నా కూడా ఏ నాడు వారు ప్రేమ‌లో ఉన్న‌ట్టు చెప్ప‌లేదు. అంతేకాదు మీడియాకి కూడా దొర‌క్కుండా జాగ్ర‌త్త‌ ప‌డ్డారు. జూన్‌లో సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకొని అంద‌రికి పెద్ద షాకిచ్చారు. ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్న ఈ ప్రేమ జంట ఎప్పుడు పెళ్లి పీట‌లు ఎప్పుడు ఎక్కుతారా అని అంద‌రు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం వీరి పెళ్లి న‌వంబ‌ర్ 1న జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుంది. ఆగ‌స్ట్‌లోనే వీరి పెళ్లి ఉంటుంద‌ని అంద‌రు భావించారు. కానీ ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. న‌వంబ‌ర్‌లో పెళ్లి జ‌ర‌గ‌నుండ‌డంతో అటు వరుణ్‌, ఇటు లావణ్య ఫ్యామిలీస్ పెళ్లి పనులతో బిజీ అయ్యారు.

తాజాగా వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠి జంట ఓ షాపింగ్‌మాల్‌లో జంటగా కనిపించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రాకు చెందిన షో రూమ్‌లో ఈ ల‌వ్ బ‌ర్డ్స్ కనిపించ‌డంతో పెళ్లికి సంబంధించిన దుస్తులు, ఇతరత్రా షాపింగ్ కోసమే వీరు అక్క‌డికి వెళ్లార‌ని అంద‌రు భావిస్తున్నారు.

పెళ్లికి మ‌రెంతో స‌మ‌యం లేదు కాబ‌ట్టి వారు ఇద్ద‌రు ఇలా షాపింగ్స్‌తో బిజీ అయ్యార‌ని అంద‌రు అనుకుంటున్నారు. ఇక ఇటలీలోని ఓ ప్యాలెస్‌లో వరుణ్‌, లావణ్యల వివాహం ప్రైవేట్ ఈవెంట్‌గా జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు, స్నేహితులకి మాత్రమే పెళ్లికి ఆహ్వానం దక్కిన‌ట్టు తెలుస్తుంది.

ఇక లావ‌ణ్య త్రిపాఠి- వ‌రుణ్ తేజ్ సుమారు ఆరేళ్ల క్రితం వచ్చిన మిస్టర్‌ సినిమాలో జంట‌గా న‌టించారు. ఆ స‌మ‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య స్నేహం ఏర్ప‌డ‌గా, అంతరిక్షం సినిమా షూటింగ్ స‌మ‌యంలో ప్రేమ‌గా మారింది. అప్ప‌టి నుంచి ఈ జంట త‌మ ప్రేమ వ్య‌వ‌హారాన్ని చాలా గోప్యంగా ఉంచారు. ఈ ఏడాది జూన్‌ 9న ఉంగరాలు మార్చుకుని తమ ప్రేమ బంధాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు.

వరుణ్ తేజ్‌ నటించిన గాంఢీవధారి అర్జున ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రం దారుణంగా నిరాశ‌ప‌ర‌చింది. ప్రస్తుతం పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే ఓ సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమాపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి చివరిగా పులి మేక అనే వెబ్‌ సిరీస్‌లో న‌టించ‌గా, ఇప్పుడు చిన్నాచిత‌కా సినిమాలు చేస్తుంది.

Updated On 18 Sep 2023 1:25 PM GMT
sn

sn

Next Story